4 నెలల్లో 18 కిలోలు తగ్గింది: నటుడు | Karan Wahi Says His Mother Lost 18 kgs Weight During Lockdown | Sakshi
Sakshi News home page

అమ్మ 4 నెలల్లో 18 కిలోలు తగ్గింది: కరణ్‌

Published Fri, May 8 2020 12:33 PM | Last Updated on Fri, May 8 2020 1:50 PM

Karan Wahi Says His Mother Lost 18 kgs Weight During Lockdown - Sakshi

ముంబై: ఊబకాయం నుంచి విముక్తి పొందేందుకు తన తల్లి వీణా వాహి నాలుగు నెలల పాటు అవిశ్రాంతంగా శ్రమించిందని నటుడు కరణ్‌ వాహి పేర్కొన్నాడు. 62 ఏళ్ల వయస్సులో 18 కిలోల బరువు తగ్గి.. వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిందన్నాడు. తన సూచన మేరకు ఫిట్‌నెస్‌ విషయంలో తల్లి ప్రదర్శించిన అంకితభావాన్ని కొనియాడుతూ ఇన్‌స్టాలో ఆమె ఫొటోలు షేర్‌ చేశాడు. లాక్‌డౌన్‌ కాలంలోనూ ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించిన తీరు అద్భుతమని ప్రశంసలు కురిపించాడు.(నాకెంతో ఇష్ట‌మైన వ్య‌క్తి ఆయ‌న: దీపికా)

ఈ మేరకు.. ‘‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది అమ్మ. నా మాట విన్నందుకు ధన్యవాదాలు. మా అమ్మకు ఇప్పుడు 62 ఏళ్లు. తను హైపోథైరాయిడ్‌. అయినప్పటికీ పట్టుదల వీడలేదు. నాలుగు నెలల్లో 18 కిలోలు తగ్గింది. లాక్‌డౌన్‌లోనూ మా అమ్మ ఎంతో ధైర్యంగా నిలబడింది. వయసు కేవలం సంఖ్యను మాత్రమే సూచిస్తుందని మరోసారి నిరూపితమైంది. దీనికంతటికి కారణమైన తహీరాకొచ్చర్‌కు కృతజ్ఞతలు. ఇతరులను ప్రభావితం చేయడం కాదు.. వారిలో స్ఫూర్తి నింపడం గొప్ప విషయం. లవ్‌ యూ అమ్మా’’ అని కరణ్‌ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. ఈ క్రమంలో సినీ సెలబ్రిటీలు సింగర్‌ విశాల్‌ దద్లానీ, గౌతం రోడే, మందిరా బేడీ, శరద్‌ ఖేల్కర్‌, శిబానీ దండేకర్‌ వీణా వాహిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.(పోల్‌ డ్యా‌న్స్‌ను చాలా మిస్సవుతున్నా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement