కరణ్, అమృత, నిషా, దివ్య, ప్రీతి ముఖ్య తారలుగా నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్ గొంటి నిర్మించిన చిత్రం ‘బెస్ట్ లవర్స్’. ఈ నెల 8న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషనల్ పోస్టర్స్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలశ్రీనివాస యాదవ్ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. హీరో శ్రీకరణ్ మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియా నేపథ్యంలో సాగే అందమైన లవ్‌స్టోరీ ఇది. సినిమా బాగా వచ్చింది. ట్రైలర్‌కు, పాటలకు మంచి స్పందన లభించింది.
సినిమా హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని సినిమా తీశాం. అనుకున్నది అనుకున్నట్లుగా తీయగలిగాను’’ అన్నారు దర్శకుడు. ‘‘మంచి ఫీల్ ఇచ్చే లవ్‌స్టోరీ చేశాం’’అన్నారు నిర్మాత. ‘‘టైటిల్ క్యాచీగా ఉంది. ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. శ్రీకరణ్ చక్కగా చేశాడు. సినిమా విజయం సాధించాలి’’ అన్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. అట్లూరి రామకృష్ణ, సాయి వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియా లవ్‌స్టోరీ
Published Tue, Jun 5 2018 12:31 AM | Last Updated on Tue, Jun 5 2018 12:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment