తెరపైకి హీరో వారసుడు! | Sunny Deol to launch his son Karan in Bollywood | Sakshi
Sakshi News home page

తెరపైకి హీరో వారసుడు!

Published Thu, Aug 25 2016 2:07 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

తెరపైకి హీరో వారసుడు!

తెరపైకి హీరో వారసుడు!

ముంబై: బాలీవుడ్ లో మరో వారసుడు తెరంగ్రేటం చేయబోతున్నాడు. సీనియర్ నటుడు సన్నిడియోల్ తన కుమారుడు కరణ్ ను హీరోగా పరిచయం చేయాలని భావిన్నాడు. 30 ఏళ్ల క్రితం తనకు తొలి విజయాన్ని అందించిన 'బెతాబ్' సినిమాను కరణ్ తో రీమేక్ చేయాలని కోరుకుంటున్నాడు. మంచి కథ కోసం చాలా ఆగాడు. చివరకు 'బెతాబ్'కే ఫిక్సయినట్టు తెలుస్తోంది.

అమృతా సింగ్, సైఫ్ అలీఖాన్ కూతురు సారాను కరణ్ కు జోడిగా నటింపజేయాలని ప్రయత్నిస్తున్నాడు. తన తొలి సినిమాలో సన్నిడియోల్ మొదటి సినిమాలో అతడి సరసన అమృతా సింగ్ నటించింది. అయితే కరణ్-సారా జోడి కుదిరేట్టు లేదు. ఎందుకంటే ధర్మా ప్రొడక్షన్ లో మొదటి సినిమా చేసేందుకు సారా అంగీకరించింది. కరణ్ జోహర్ నిర్మించనున్న సినిమాతో ఆమె తెరంగ్రేటం చేయనుంది. దీంతో శ్రీదేవి కూతురు జాహ్నవిని సంప్రదించాలని సన్నిడియోల్ భావిస్తున్నాడట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement