
కిరణ్ బేడీపై కట్జూ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు. ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి కిరణ్ బేడీ కంటే షాజియా ఇల్మీ అందగా ఉంటుందని కట్జూ ట్వీట్ చేశారు.
అంతేగాక ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా షాజియాను ప్రకటించివుంటే బీజేపీ విజయం సాధించేదని కట్జూ పేర్కొన్నారు. ప్రజలు అందంగా ఉన్నవారికే ఓటు వేస్తారంటూ మరో ట్వీట్ చేశారు. ఓటు హక్కు వినియోగించుకోని తనలాంటి వారు కూడా షాజియాకే ఓటు వేస్తారని కట్జూ ట్విట్టర్లో పేర్కొన్నారు. కట్జూ వ్యాఖ్యలను విమర్శిస్తూ నెటిజన్లు ట్వీట్లు చేశారు.