Bizarre
-
వరదలపై చంద్రబాబు విచిత్ర వ్యాఖ్యలు
అమరావతి, సాక్షి: వాతావరణ శాఖ హెచ్చరికలను పట్టించుకోకుండా ముంపు పరిస్థితికి కారణమైన చంద్రబాబు సర్కార్.. ఇప్పుడు సహాయక చర్యల విషయంలోనూ అలసత్వం ప్రదర్శిస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. నాలుగు రోజులు గడిచినా.. ఇంకా విజయవాడ జలదిగ్బంధంలోనే ఉండిపోయింది.అయితే స్వయంగా తానే గ్రౌండ్లెవల్లో ఉన్నానంటూ ఫొటోలకు ఫోజులు, బిల్డప్‌లు ఇచ్చుకుంటున్న చంద్రబాబు.. తాజాగా వరదలపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో.. సాక్షి రిపోర్టర్ కరకట్టలోని చంద్రబాబు నివాసం మునిగిన విషయాన్ని ప్రస్తావించారు. అంతటితో ఆగకుండా.. ఆ విజువల్స్, ఫొటోలు చూపించారు. అయితే.. అదంతా అబద్ధం అంటూ సాక్షి విలేఖరికి అంతెత్తు ఎగిరిపడ్డారు సీఎం చంద్రబాబు. విజయవాడలో చాలా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. అందరి ఇళ్లలాగే మా ఇంట్లోకి నీళ్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏంటి?.. అంటూ అసహనం ప్రదర్శించారాయన. -
రాముడు కలలోకొచ్చాడు.. 22న అయోధ్యకి రాడట!
స్వయంగా శ్రీరామచంద్రుడే ఆయన కలలోకి వచ్చాడట!. వచ్చి ఏం చెప్పాడనేగా.. ఏం లేదు ఈ నెల 22వ తేదీన జరగబోయే అయోధ్య రామ్‌లల్లాప్రాణ ప్రతిష్టకు తాను రావట్లేదని చెప్పాడట!. ఎందుకు.. రాముడు ఏమైనా అలిగాడా? అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై పలువురు నేతలు వ్యాఖ్యలు చేస్తుండడం.. వాటిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతుండడం చూస్తున్నాదే. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ అదే తరహా స్టేట్మెంట్ ఇచ్చారు. ‘‘ఒక్కసారి ఎన్నికలు అయిపోయాయంటే శ్రీరామచంద్రుడ్ని అంతా మరిచిపోతారు. అలాంటప్పుడు జనవరి 22వ తేదీన రావడం అవసరమా?. నాలుగు శంకరాచార్యులతో పాటు నా కలలోకి శ్రీరాముడు వచ్చారు. అయోధ్యలో కపటనాటకం నడుస్తుంది కాబట్టి తాను రావట్లేదని నాతో చెప్పారు’’ అని ఓ కార్యక్రమంలో తేజ్ ప్రతాప్ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 22 तारीख़ को राम जी नहीं आयेंगे हमको भी 4 शंक्राचार्य की तरह सपने में आकर बोले हैं राम जी — तेज प्रताप यादव #ayodhyarammandir #tejpratapyadav pic.twitter.com/rj5oaUAtb0 — Uved Muazzam 🇮🇳 (@mohd_uved) January 14, 2024 వైరల్ అవుతున్న ఈ వ్యాఖ్యలపై తేజ్ ప్రతాప్ సోదరుడు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించాల్సింది. మరోవైపు ఈ ఆర్జేడీ యువ నేత వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో అనే ఆసక్తి నెలకొంది. -
రాత్రికి రాత్రే చెరువు మాయం! తెల్లారేసరికి అక్కడ..!
కొన్ని రాష్ట్రాల్లో జరిగే వింత ఘటనలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వామ్మో! ఇదేంటి అనిపిస్తుంది. సాధారణంగా దొంగలు చైన్లు, పర్సులు, ఇళ్లు దోచుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ బిహార్‌లో మాత్రం దొంగలు చాలా వెరైటీగా ఉంటారు. అక్కడ ఒక్కసారి ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకుపోయారు. ఆ తర్వాత ఓ సొరంగం మార్గం ద్వారా బెగుసరాయ్‌లోని రైల్వే యార్డ్ నుంచి ఏకంగా రైలు ఇంజన్ని ఎత్తుకుపోయారు. ఇలాంటి విచిత్రమైన చోరీలతో బిహార్ తరుచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. మళ్లీ ఇప్పుడూ ఈ చెరువు కారణంగా మరోసారి హాట్‌టాపిక్‌గా వార్తల్లో నిలిచింది. ఎక్కడైన చెరువుని ఎత్తుకెళ్లడం గురించి విన్నారా! అదికూడా ఒక్కరాత్రిలో మాయం చేయడం అంటే నమ్ముతారా?. అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ దుండగలు ఎవరో గానీ ఎత్తుకెళ్లే దమ్ముంటే ఏదైనా చెయ్చొచ్చు అన్నా రేంజ్లో చేసి చూపించారు!. ఈ విచిత్ర ఘటన బిహార్‌లోని దర్భంగా జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉండే ప్రజల అవసరాలకు ఉపయోగపడే ఓ చెరువు రాత్రికి రాత్రే మాయమైపోయింది. తెల్లారేసరికి ఆ ప్రదేశంలో నీళ్లు లేకుండా మట్టితో పూడుకుపోయి, అక్కడ ఒక గుడిసె మాత్రమే కనిపించింది. దీంతో షాకైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ చెరువుని చేపలు పట్టడానికి, వ్యవసాయానికి వినియోగించేవాళ్లమని స్థానికులు చెబుతున్నారు. ఇంతకమునుపు మండల అధికారులు చెరువు పూడిక తీత పనులు మొదలుపెట్టారని తాము అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ పనులు నిలిపేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా ఎలా జరిగిందన్నాది తామకిప్పటికీ అంతుపట్టడం లేదన్నారు. అంతేగాదు రాత్రికి రాత్రే ఎలా చెరవు మాయం చేశారన్నది తమకు తెలియదని ఫిర్యాదులో పోలీసులకు తెలిపారు. అయితే గత కొద్దిరోజులుగా ఈ ప్రదేశంలో రోజూ రాత్రిపూట ట్రక్కులు నడిచేవని స్థానికులు చెప్పారు. ట్రక్కులతోపాటు ప్రొక్లెయినర్లు, ఇతర భారీ యంత్రాలు ఆ చెరువు వద్ద పనులు సాగించినట్లు పోలీసులకు తెలిపారు. అయితే అక్కడ ఏం జరుగుతుందనేది తమకు మాత్రం తెలియదని పేర్కొన్నారు. తీరా అక్కడికి వెళ్లి చూడగా.. నీళ్లు ఉన్న చెరువు స్థానంలో మొత్తం మట్టితో నింపేసి.. అక్కడ ఒక గుడిసె వేసినట్లు గుర్తించారు. అంతేగాదు ఈ పని అంతా కేవలం రాత్రి పూట మాత్రమే జరిగిందని స్థానికులు పోలీసులకు తెలిపారు. కానీ దర్భంగాలో పెరుగుతున్న భూముల ధరల కారణంగా దుండగుల దృష్టి ఈ చెరువుపై పడిందని అంటున్నారు. అందుకే ఇంతలా పకడ్బంధీగా చీకట్లోనే చెరువు కబ్జా చేసేందుకు యత్నించారని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారు, చెరువుని మాయం చేసేలా మట్టిని ఎలా నింపారనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఇది మాములు మిస్టరీ కాదు. ఎదుకంటే? కటిక చీకటిలోనే గుట్టు చప్పుడు కాకుండా అదికూడా ఏకంగా ఓ చెరువునే మాయం చేశారు దుండగలు. (చదవండి: New Year 2024: ఇవాళ ఇవి తింటే..లక్కే లక్కు..డబ్బే..డబ్బు..) -
వాళ్లు అందుకే గెలిచారు: సుప్రీం మాజీ జడ్జి కట్జూ సంచలన వ్యాఖ్యలు
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ వరల్డ్ కప్ (World cup 2023) ఫైనల్లో భారత జట్టు ఓటమిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే టీమిండియా ఘోర ఓటమిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతుండగా, వింత వాదనతో ఈ జాబితాలో మార్కండేయ కట్జూ చేరారు. ఆయన చెప్పిన కారణం వింటే నెటిజన్లు షాకవుతున్నారు. మహాభారత కాలంలో ఆస్ట్రేలియా ఆనాటి పాండవులు తమ అస్త్రాలు భద్రపరుచుకునే కేంద్రంగా ఉండేది. అప్పట్లో దాన్ని 'అస్త్రాలయ' అని పిలిచేవారు. వారు (ఆస్ట్రేలియా) ప్రపంచకప్ గెలవడానికి ఇదే అసలు కారణం అంటూ జస్టిస్ మార్కండేయ కట్జూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్ల ఒక రేంజ్లో స్పందించారు. ఎలాంటి రుజువులు సాక్ష్యాలు లేని అతని విచిత్రమైన సిద్ధాంతంపై నెటిజన్లుమండిపడుతున్నారు. ధన్యవాదాలు సార్...మీరు కామెడీ చేసి చాలా రోజులైందంటూ ఒక యూజర్ విమర్శించారు. దుబాయ్‌ని మిస్టర్ దూబే, ఈజిప్ట్ (హిందీలోమిస్ర్) మిశ్రా రూపొందించారు, ఇజ్రాయెల్‌ను యాదవులు, బహ్రెయిన్‌ను బ్రహ్మ దేవుడు, సౌదీ అరేబియాను సరస్వతి దేవి సృష్టించారా? అంటూ మరొక వినియోగదారుడు జస్టిస్ కట్జూపై మరొక యూజర్ ధ్వజమెత్తారు. Australia was the storage centre of the 'Astras' of Pandavas. It was called 'Astralaya'. This is the real reason why they won the World Cup. — Markandey Katju (@mkatju) November 20, 2023 కాగా గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పటి మొదలు పేలవమైన బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో స్లిప్-అప్ల వరకు, అన్ని మ్యాచ్‌లోనూ అజేయంగా నిలిచిన రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు చివరికి ట్రోఫీని అందుకునే అదృష్టాన్ని దక్కించుకోలేకపోవడంపై నిపుణులుమొదలు సామాన్యుడి దాకా అనేక విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా వ్యవహరించిన కట్జూ అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి ఇపుడు వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయానికి కారణాలను చెప్పిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జస్టిస్ కట్జూ 1970 నుండి 1991 వరకు అలహాబాద్ హైకోర్టులో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ఏప్రిల్ 2006లో భారత సుప్రీంకోర్టు జడ్జికావడానికంటే ముందు వివిధ ఉన్నత స్థానాల్లో పనిచేశారు. సెప్టెంబర్, 2011లో పదవీ విరమణ చేశారు. -
‘యమహా’ యమ్మా ఏం బైక్ గురూ..! (ఫొటోలు)
-
టాయిలెట్ల వెనక చాలా కథ ఉంది.. ఈ వింతలు, విశేషాలు తెలుసా? (ఫోటోలు)
-
అద్దె ఇళ్ల కోసం వెతుకుతున్నారా? నిబంధనలు వింటే అవాక్ అవ్వాల్సిందే!
సాధారణంగా సొసైటీలు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యూఏ)లు నివసించే వారి సౌకర్యం కోసం నిబంధనలు విధిస్తుంటాయి. అయితే ఇప్పుడు వాటిల్లో కొన్ని విచిత్రమైన రూల్స్ నెటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. బెంగళూరులోని కుందనపల్లి గేట్ ఏరియా ప్రాంతానికి చెందిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టిన కండీషన్స్ ఇలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా.. ►బ్యాచిలర్స్, పెళ్లికాని వాళ్లు ఫ్లాట్లలోకి వచ్చేందుకు అనుమతి లేదు ►గెస్ట్‌లు ఎవరైనా రావాలంటే రాత్రి 10 గంటల తర్వాతే రావాలి ►ఒకవేళ వస్తే కారణాన్ని వివరిస్తూ ఓనర్, మేనేజర్, అసోసియేషన్ ఆఫీస్‌కు ఐడీ ఫ్రూప్‌తో పాటు అతిధులు ఎన్నిగంటలకు వస్తున్నారు. ఎంత సమయం ఉంటారో మెయిల్ పెట్టి అనుమతి తీసుకోవాలి. ►బ్యాచిలర్స్, పెళ్లికాని వాళ్లు తప్పని సరిగా అసోసియేషన్ విధించిన కండీషన్లకు కట్టుబడి ఉండాలి. లేదంటే రూ.వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ►రాత్రి 10 గంటల తర్వాత పెద్దగా మ్యూజిక్ సౌండ్ వినిపించకూడదు. లేట్ నైట్ పార్టీలు చేసుకోకూడదు. కారిడార్లు, బాల్కనీలల్లో ఫోన్ మాట్లాడకూడదనే కండీషన్లు పెట్టారంటూ బాధితులు వాపోతున్నారు. ఆ కండీషన్ల గురించి రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. Marathalli సొసైటీలో అబ్బాయిలు, అమ్మాయిల ఫ్లాట్లలోకి వెళుతున్నారా? లేదా అని బ్యాచిలర్స్ ఫ్లాట్లను పర్యవేక్షిస్తారు. అతిథులు వెళ్లిపోయారా లేదా అని చూడటానికి సెక్యూరిటీ గార్డ్లు బ్యాచిలర్స్ ఫ్లాట్లను చెక్ చేస్తున్నారంటూ ఓ యూజర్ కామెంట్ చేస్తున్నారు. ‘ఇది హాస్టళ్ల కంటే దారుణం. మీరు ఫ్లాట్లలో ఉండేందుకు రెంట్ చెల్లిస్తున్నారు.రెంటల్ అగ్రిమెంట్ల ప్రకారం అద్దెకు తీసుకున్న కాలానికి ఇది మీ ఫ్లాట్. మీ ఫ్లాట్‌కి ఎవరు వస్తారు? బాల్కనీలో ఏం చేస్తారు? అనేది మీ ఇష్టం ఈ రోజుల్లో సొసైటీ నియమాలు అసహ్యంగా మారుతున్నాయి’ ఓ యూజర్ కామెంట్ చేస్తున్నారు. ‘బ్యాచిలర్స్‌కు విధించిన నిబంధనలు మరింత జుగుప్సాకరంగా ఉన్నాయి. అందుకే నేను సొసైటీలలో ఉండడాన్ని ద్వేషిస్తున్నాను! మరొక యూజర్ అన్నాడు. -
వెరైటీ ఆచారం: వధువు వరుడుగా.. వరుడు వధువుగా..
ఆ వంశస్తుల ఇంట పెళ్లంటే సందడే కాదు.. తరతరాలుగా వస్తున్న విచిత్ర సంపద్రాయాల మేళవింపు.. అందుకే నల్లజర్ల మండలం పోతవరంలో గన్నమని వారింట పెళ్లంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. పెళ్లి కుమారుడు పట్టుచీర కట్టుకుని, నడుముకు వడ్డాణం, చేతికి అరవంకి పెట్టుకుంటే చుట్టూ చేరిన అమ్మలక్కలు అతనిని చూసి మురిసిపోతారు. ఇక ఆ ఇంట అమ్మాయి పెళ్లికూతురైతే టిప్‌టాప్‌గా ప్యాంటు, షర్టు వేసుకుని చలువ కళ్లద్దాలు పెట్టుకుని ఠీవిగా పోజులిస్తుంది. పెళ్లికి ఒకరోజు ముందు జరిగే ఈ తంతు కనువిందుగా సాగిపోతుంది. అమ్మవారి మొక్కు తీర్చుకునే క్రమంలో చేపట్టే ఈ వేషధారణను ఆ వంశస్తులు కాపాడుకుంటూ వస్తున్నారు. జిల్లాలో గన్నమని ఇంటి పేరున్న అమ్మాయి పెళ్లి జరిగితే అబ్బాయిగా అలంకరిస్తారు. ఆ ఇంటి పేరున్న అబ్బాయికి పెళ్లయితే అమ్మాయిగా ముస్తాబు చేస్తారు. పెళ్లికి ఒకరోజు ముందు ఇలా అలంకరించి కులదేవతకి బోనం సమర్పిస్తారు. నల్లజర్ల: పెళ్లంటే పందిళ్లు, సందళ్లు, తాళాలు, తలంబ్రాలే కాదు.. వింత ఆచారాల కలయిక. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి ఒక విలక్షణ ఆచారం కొనసాగింపుగా వస్తుంది. జిల్లాలోని గన్నమని ఇంటి పేరున్న వారు కాకతీయుల కాలం నుంచి విభిన్న ఆచారం పాటిస్తున్నారు. ఆ సంప్రదాయాన్ని నేటి తరం కూడా ఆచరిస్తూ కనువిందు చేస్తోంది. గన్నమని వారింట వివాహం జరిగితే ఆ ఇంటి పేరున్న అమ్మాయిని అబ్బాయిగా అలంకరిస్తారు. అలాగే గన్నమని ఇంటిపేరున్న అబ్బాయికి పెళ్లి జరిగితే పెళ్ళికి ముందు రోజు అమ్మాయిగా ప్రత్యేక దుస్తుల్లో అలంకరిస్తారు. కులదేవత ఆలయానికి లేదా గ్రామ దేవత ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి మొక్కులు తీర్చుతారు. ఈ ఆచారాన్ని బోనంగా పిలుస్తారు. పెళ్ళికుమార్తెకు ప్యాంటు, షర్టు కట్టి వరుడి వేషం వేయిస్తారు. అబ్బాయికైతే పట్టుచీర, జాకెట్ కట్టి ఆభరణాలు అలంకరించి తెలుగింటి పెళ్లికూతురిగా ముస్తాబు చేస్తారు. అలా ముస్తాబు చేసిన వధువు లేదా వరుడ్ని బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామమంతా ఊరేగిస్తారు. గ్రామ దేవత ఆలయానికి తీసుకెళ్ళి ప్రత్యేక పూజలు చేయిస్తారు. గొర్రెను బలిచ్చి అన్నంతో కుంభం సమర్పిస్తారు. ముడుపులు, మొక్కుబడి చెల్లించుకుంటారు. పోతవరంలో వరుడి వేషంలో పెళ్లికుమార్తె(ఫైల్)- పెళ్ళికుమార్తె వేషధారణలో ప్రభుప్రసాద్(ఫైల్) కాకతీయుల కాలం నుంచీ ఆచారంగా.. ఈ ఆచారం కాకతీయుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. రుద్రమదేవి వద్ద గన్నమని వంశస్తుల మూల పురుషుడు సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన హయాంలో సైన్యంలో ఉన్న మగవారు యుద్ధంలో ఎక్కువగా చనిపోవడంతో మహిళలు మగవారి వేషధారణలో సైన్యంలో విధులు నిర్వర్తించేవారు. ఈ విషయం బయటకు తెలియకుండా కాపాడమని కులదేవతను వేడుకునేవారు. పెళ్లి సమయంలో ఆడవారికి మగ వేషం, మగవారికి ఆడవేషం వేసి మొక్కులు చెల్లిస్తామని ప్రార్థించేవారు. అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. సంప్రదాయాన్ని కాపాడుకుంటున్న యువత ఈ విచిత్ర ఆచారాన్ని గన్నమని ఇంట నేటి యువత ఎంతో ఆసక్తి అనుసరిస్తున్నారు. తమ వంశాచారం పాటించడానికి ఎలాంటి ఇబ్బందీ లేదని చెబుతున్నారు. వారి వంశంలో ఎవరి ఇంట పెళ్ళైనా ఇదే ఆచా రాన్ని పాటిస్తామంటున్నారు. మా ఆచారాన్ని మర్చిపోం ఎన్ని చదువులు చదివి ఏ దేశానికి వెళ్లి ఉద్యోగం చేస్తున్నా మా సంస్కృతీ సంప్రదాయాన్ని మరిచిపోం. అందుకే పెద్దలు చెప్పినట్లుగా విని పెళ్లిలో మా వంశాచారం పాటిస్తున్నాం. – భాను ప్రసాద్, అనంతపల్లి సంప్రదాయాన్ని గౌరవించాలి భారతీయ సంప్రదాయాలపై పాశ్చాత్య దేశాల్లోనూ చాలా గౌరవం ఉంది. మన సంప్రదాయాన్ని మనం గౌరవించాలి. పెళ్లిలో వేషధారణ గురించి పెద్దవాళ్ళు చెప్పారు. మేం కూడా ఆ ఆచారాన్ని అలా కొనసాగిస్తున్నాం. – డాక్టర్ మానస, పోతవరం అనాదిగా వస్తున్న ఆచారం ఈ ఆచారం కొనసాగడానికి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. గన్నమని ఇంటి ఆడపడుచు రోజూ పుట్టెడు బియ్యం తినేది. పురుషుడి వలే ప్రవర్తించేది. ఎవరూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. అపుడు గ్రామ దేవతకు మొక్కి తమ కుమార్తెకు వివాహం జరిగితే మగవేషం వేసి మొక్కులు చెల్లిస్తామని తల్లిదండ్రులు వేడుకున్నారు. ఆమెకు పెళ్లి ముందురోజు పెళ్లికొడుకు వేషం వేసి ఆలయానికి ఊరేగింపుగా గుడికి వెళ్ళి మొక్కులు చెల్లించిన ట్లు పూర్వీకులు చెబుతారు. అప్పటి నుంచి అదే ఒరవడి కొనసాగుతుంది. – గన్నమని రాము, పోతవరం సంతానం నిలవడం కోసం.. గన్నమని వంశంలో పుట్టిన మగపిల్లలు అందరూ చనిపోయే వారు. పుట్టిన సంతానం నిలవడం కోసం గ్రామ దేవతకు మొక్కుకోవడంతో వారి కోరిక ఫలించింది. అప్పటి నుంచి మగపిల్లలకు ఆడవేషం, ఆడపిల్లలకు మగవేషం వేసి గ్రామదేవత గుడికి ఊరేగింపుగా వెళ్ళి మొక్కులు చెల్లిస్తున్నాం. ఆ సమయంలో పొట్టేలు బలి ఇస్తారు. – రామ దుర్గాప్రసాద్, అనంతపల్లి -
ఈ జీవి పేరు మీకు తెలుసా!
-
నన్ను కాదని వెళ్తే జాండీస్ సోకుతుంది
లక్నో: యూపీ మంత్రి, వివాదాల పుట్ట ఓం ప్రకాశ్ రాజ్‌భర్ మరోసారి తన నోటికి పని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులకు ఆయన విచిత్రమైన శాపనార్థాలు పెట్టారు. తనకు వ్యతిరేకంగా ఎవరైనా ర్యాలీలు నిర్వహించినా, లేదా ఎవరైనా ఆ ర్యాలీలో ఎవరైనా పాల్గొన్న... వారు జాండీస్ సోకుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బల్లియాలో నిర్వహించిన మద్యపాన నిషేధ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘నా తరపు మనుషులు వచ్చి పిలిస్తేనే మీరు మా ర్యాలీల్లో పాల్గొనాలి. అలా కాదని నా రాజకీయ ప్రత్యర్థుల ర్యాలీలో వెళ్లారో జాగ్రత్త. మీకు జాండీస్ సోకుతుంది. ఇదే నా శాపం. పైగా దానికి నేను మందిస్తేనే మీకు నయం అవుతుంది.’ అని వ్యాఖ్యానించారు. కాగా, యూపీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్ మోడల్‌ను ఇక్కడ ప్రవేశపెడతా అని చెప్పారని, కానీ, ఇంత వరకు అది నెరవేర్చలేదని రాజ్‌భర్ ప్రస్తావించారు. మద్యపాన నిషేధంతోపాటు మిగతా హామీలను కూడా మోదీ నెరవేరిస్తే మంచిదని రాజ్‌భర్ వ్యాఖ్యానించారు. కాగా, ‘సుహెల్దేవ్ భారతీయ సమాజ్’ పార్టీ చీఫ్ అయిన ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ప్రస్తుతం యూపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. గత కొంత కాలంగా బీజేపీ విధానాలపై, యోగి సర్కార్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ మోసం చేసిందంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో ఆయన కూటమి నుంచి వైదొలిగే సంకేతాలు ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. -
లగ్జరీ కార్లను అలా వదిలేశారు!
బీజింగ్: చైనాలోని చెంగ్డూ నగరంలో దాదాపు 200 కార్లను వాటి యజమానులు ఊరికే అలా ఓ పార్కులో వదిలేశారు. వాటిలో ఒక్కొక్కటి మూడు కోట్ల రూపాయలు విలువచేసే రెండు బెంట్లీస్, మూడు ల్యాండ్ రోవర్స్, మూడు మూడు మెర్సిడెస్ బెంజీ కార్లతోపాటు ఓ లగ్జరీ టూ వీలర్ కూడా ఉంది. వివిధ కారణాల వల్ల నిరుపయోగంగా అలా వదిలేసిన కార్లను తీసుకెళ్లాల్సిందిగా వాటి యజమానులకు స్థానిక అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. కొన్నింటిని ఇప్పటికే స్థానిక అధికారులు వేలం వేయగా, కఠిన చట్టాల కారణంగా మిగతా వాహనాలను ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. ఇప్పుడు టైరంట్స్ కారు పార్కింగ్‌గా పిలుస్తున్న ఆ మైదానంలో కొన్ని కార్లను వదిలేసి రెండేళ్లు పైబడడంతో వాటి చుట్టూ దట్టమైన పొదలు కూడా పెరిగాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడం వల్ల కొన్నింటిని, సరైన కాగితాలు లేకపోవడం వల్ల కొన్నింటినీ, చట్టప్రకారం కాలం తీరిపోయిన కారణంగా మరికొన్ని కార్లను అలా యజమానులు వదిలేశారని స్థానిక మున్సిపల్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. ఆ కార్లను వేలం వేయాలంటే వాటికి డూప్లికేట్ పత్రాలను సృష్టించాల్సి ఉంటుంది. అందుకు చైనా ఆర్టీయే చట్టాలు అనుమతించవు. -
మట్టితినడమే పనిగా...
మట్టి వాసనను ఇష్ట పడని మనుషులుండరు. చిన్న తనంలో చాలామందికి మట్టి, చాక్ పీస్ లు వంటివి తిన్న అనుభవాలూ ఉంటాయి. కొందరు గర్భిణిలకు కొన్ని వాసనలు పడకపోవడంతోపాటు, కొన్ని వస్తువులను పదే పదే తినాలన్న కోరిక కూడ కలుగుతుంటుంది. అయితే అవి గర్భంలోని పిల్లలకు ఎటువంటి హాని కలిగించనివి అయితే ఫర్వాలేదు. కానీ ఓ మహిళ ఏకంగా మూడు నెలల గర్భిణిగా ఉన్నప్పటినుంచీ ఇటుక పొడిని, మట్టిని తినడం పనిగా పెట్టుకొందట. మట్టి తినేందుకు, ఆ విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉండేందుకు అనేక అబద్ధాలు కూడ చెప్తుండేదట. లివర్‌పూల్ కు చెందిన చెందిన 30 ఏళ్ళ జెన్నీ మాసన్.. మూడు నెలల గర్భిణిగా ఉన్నపుడు ఇటుకపొడి, ఇసుక, మట్టి వంటి పదార్థాలను ఎవ్వరికీ తెలియకుండా తినేసేదట. ఇంట్లోని గోడల్లో ఉండే ఇటుకల పొడి, గార్డెన్ లోని మట్టిలను అందరి కళ్ళూగప్పి సేకరించుకొని, ఆహార పదార్థాలతోపాటు.. ఎంతో ఇష్టంగా తినేదట. అయితే అటువంటి పదార్థాలను తినాలన్న అలవాటు... ఆమెలో చివరికి 'పికాగా' నిర్థారణ అయ్యిందట. రైలీ కొన్నోర్ గర్భంలో పడినప్పుడు అలవాటుగా మారిన మట్టి తినే సమస్య... ఆమెకు అతడు పుట్టిన మూడు నెలల తర్వాత తీరిందట. ఓ టీవీ కార్యక్రమంలో మట్టి తినడంవల్ల కలిగే నష్టాలను వివరించినా ఆమె మానుకోలేక పోయిందట. అంతకు ముందు పికా గురించి తాను ఎప్పుడూ వినలేదని, అటువంటి సమస్య ఉంటుందని తనకు తెలియదని జెన్నీమాసన్ చెప్తోంది. పికా అనేది శరీరంలో రక్త హీనత, పోషక లోపాల వల్ల సంభవించే రుగ్మత అని, అది మట్టి, ఇసుక, ఇటుకపొడి వంటివి తినే కోరిక కలిగేట్లుగా చేస్తుందని తెలుసుకొన్న జెన్నీ తర్వాత... వాటి జోలికి పోలేదు. గర్భధారణ సమయంలో ఇటువంటి లోపాలు సంభవించడం సాధారణమేనని, అయితే సమస్యను వెంటనే వైద్యులకు వివరించి తగిన జాగ్రత్తలు, వైద్యం తీసుకోకుంటే తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందని తెలుసుకొంది. పోషక విలువలు కలిగిన పదార్థాలను సేవించడం మానుకొని, పనికిరాని మట్టిని తినడం నష్టాన్ని కలుగజేస్తుందని తెలుసుకొంది. ఇసుక మట్టి దంతాలకు కూడ తీవ్ర నష్టాన్నికలిగిస్తాయని వైద్యుల ద్వారా తెలుసుకొంది. అయితే ప్రసవం వరకూ కూడ ఎవరు ఎన్ని చెప్పినా అలవాటును మానలేకపోయింది. చివరకు బిడ్డ పుట్టిన మూడు నెలల తర్వాత ఆమెలో మట్టి తినాలన్న కోరిక దూరమైంది. ప్రస్తుతం మూడేళ్ళ తన కొడుకు రైలీ కొన్నోర్ ను చూసినప్పుడల్లా ఎంతో భయం వేస్తుందని, అదృష్టం కొద్దీ బిడ్డకు ఎటువంటి అవకరాలు రాకపోయినా, తదుపని బిడ్డల విషయంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఆలోచనతో మట్టి తినడం మానుకున్నాని జెన్నీ చెప్తోంది. తనకు వచ్చిన సమస్య ఇంకెవరికైనా వస్తే వెంటనే వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకొని, కడుపులోని బిడ్డల ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవాలని హెచ్చరిస్తోంది. -
సడెన్‌గా మూడు కార్లు గాల్లోకి లేచాయి..
-
సడెన్‌గా మూడు కార్లు గాల్లోకి లేచాయి..
చైనా: మాయల పకీరు సినిమాల్లో కనుసైగలు, చేతిలో మాయాదండాన్ని కదపగానే నేలపై ఉన్న వస్తువులను గాల్లోకి ఎగిరినట్లే చైనాలోని ఓ పట్టణంలో రహదారిపై వాహనాలు ఉన్నట్లుండి గాల్లో తేలాయి. మూడు వాహనాలు చుట్టుపక్కలవారిని ఆశ్చర్యానికి గురిచేస్తూ వాటంతటవే పడిపోయాయి. వివరాల్లోకి వెళితే అది చైనాలోని బిజీగా ఉండే జింటాయి ప్రాంతంలో. అక్కడి రహదారి ఎప్పుడూ తీరిక లేకుండా రద్దీగా ఉంటుంది. గతవారం ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఓ దృశ్యం సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. వేగంగా వచ్చిన వాహనం ఒకటి సరిగ్గా సిగ్నల్‌ను సమీపిస్తుండగానే ఉన్నట్లుండి అకస్మాత్తుగా గాల్లోకి లేచి పక్కనే ఉన్న వాహనం పై పడిపోయింది. ఆ వాహనం కూడా గాల్లోకి లేచి కిందపడగా.. దాని పక్కనుంచి వెళుతున్న వాహనం కూడా ఎవరో పైకి ఎత్తే క్రమంలో అటుఇటు కుదిపేసినట్లుగా రోడ్డుపై కదులుతూ ఆగిపోయింది. అదృష్టవశాత్తు ఆ వాహానాల్లోని వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే, అదృశ్య శక్తుల వల్ల ఆ వాహనాలు గాల్లోకి లేవలేదని, ఒక సన్నటి వైరు వాటికి అనుకోకుండా తగులుకోని ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. -
థాయ్ గ్రామంలో వింత ఆకారం...
ఓ వింత రూపం థాయ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. థాయ్ ల్యాండ్ లోని మారు మూల గ్రామంలో కనిపించిన ఆ వింతను చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. ఆ రూపం పుట్టింది గేదెకైనా దానికి మొసలి ఆకారం మిళితమై ఉండటాన్ని వింతగా చూస్తున్నారు. చూసేందుకు నల్లని ఆకారంతో కాళ్ళు గేదె రూపాన్ని సంతరించుకున్నా... శరీరం మాత్రం పొలుసులుదేరి మొసలిని తలపించడంతో అంతా ఆ వింతను చూసి విస్తుపోతున్నారు. ఇది సంకర జాతి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ఈ వింత జన్మ తమ గ్రామానికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని నమ్ముతున్నారు. అయితే పుట్టిన కొద్ది సమయానికే మృతి చెందిన ఆ జంతువుకు.. వింత ఆకారం ఎలా వచ్చింది అన్న దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.