స్వయంగా శ్రీరామచంద్రుడే ఆయన కలలోకి వచ్చాడట!. వచ్చి ఏం చెప్పాడనేగా.. ఏం లేదు ఈ నెల 22వ తేదీన జరగబోయే అయోధ్య రామ్‌లల్లాప్రాణ ప్రతిష్టకు తాను రావట్లేదని చెప్పాడట!. ఎందుకు.. రాముడు ఏమైనా అలిగాడా?
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై పలువురు నేతలు వ్యాఖ్యలు చేస్తుండడం.. వాటిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతుండడం చూస్తున్నాదే. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ అదే తరహా స్టేట్మెంట్ ఇచ్చారు.
‘‘ఒక్కసారి ఎన్నికలు అయిపోయాయంటే శ్రీరామచంద్రుడ్ని అంతా మరిచిపోతారు. అలాంటప్పుడు జనవరి 22వ తేదీన రావడం అవసరమా?. నాలుగు శంకరాచార్యులతో పాటు నా కలలోకి శ్రీరాముడు వచ్చారు. అయోధ్యలో కపటనాటకం నడుస్తుంది కాబట్టి తాను రావట్లేదని నాతో చెప్పారు’’ అని ఓ కార్యక్రమంలో తేజ్ ప్రతాప్ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
22 तारीख़ को राम जी नहीं आयेंगे
— Uved Muazzam 🇮🇳 (@mohd_uved) January 14, 2024
हमको भी 4 शंक्राचार्य की तरह सपने में आकर बोले हैं राम जी — तेज प्रताप यादव #ayodhyarammandir #tejpratapyadav pic.twitter.com/rj5oaUAtb0
వైరల్ అవుతున్న ఈ వ్యాఖ్యలపై తేజ్ ప్రతాప్ సోదరుడు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించాల్సింది. మరోవైపు ఈ ఆర్జేడీ యువ నేత వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో అనే ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment