
ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్
సాక్షి, ముంబై: సరిగ్గా ఏడేళ్ల కిందట ఇదే రోజున (ఏప్రిల్ 2) టీమిండియా కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని కొట్టిన సిక్స్‌ను క్రికెట్ అభిమానులు మరిచిపోలేరు. ఎందుకంటే అది భారత జట్టుకు వన్డే ప్రపంచ కప్‌ను అందించిన మధురక్షణం. 2011 ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు మహేల జయవర్ధనే (103 నాటౌట్: 88 బంతుల్లో 13 ఫోర్లు) అజేయ శతకంతో 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
275 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను మలింగ డకౌట్ చేశాడు. ఆపై సచిన్ టెండూల్కర్ (18)ను ఔట్ చేసి మరోసారి దెబ్బకొట్టాడు మలింగ. అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన గౌతం గంభీర్ (97: 122 బంతుల్లో 9 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. కీలక ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకున్నాడు. గౌతీ ఔటయ్యాక యువరాజ్ సింగ్ (21 నాటౌట్) సహకారంతో అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని (91 నాటౌట్: 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) వీర విహారం చేశాడు.
వన్డే ప్రపంచ కప్‌తో భారత క్రికెటర్లు (ఫైల్ ఫొటో)
భారత్ విజయానికి నాలుగు పరుగులు కావాల్సిన సమయంలో కులశేఖర వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్ రెండో బంతిని 'బెస్ట్ ఫినిషర్' ధోని భారీ సిక్సర్‌గా మలిచి ప్రపంచ కప్‌ను అందించాడు. ఆ సిక్సర్ మాత్రం భారతీయుల గుండెల్లో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. మహీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. 28 ఏళ్ల తద్వారా భారత్ మరోసారి ప్రపంచ కప్ కలను నెరవేర్చుకుంది. ధోని సిక్సర్ నేడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలిసారి కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు 1983లో వన్డే వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment