సల్మాన్‌ బిజినెస్‌మేన్‌ | Salman Khan and Alia Bhatt new film Inshallah to be shot in Florida | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ బిజినెస్‌మేన్‌

Published Sat, Jun 22 2019 1:48 AM | Last Updated on Sat, Jun 22 2019 1:48 AM

Salman Khan and Alia Bhatt new film Inshallah to be shot in Florida - Sakshi

సల్మాన్‌ఖాన్‌

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ ఫ్లోరిడా వెళ్లనున్నారు. పర్సనల్‌ వర్క్‌పై కాదు. ప్రొఫెషనల్‌ వర్క్‌ మీదే. తన నెక్ట్స్‌ చిత్రం కోసమే ఈ యూఎస్‌ పయనం. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌ హీరోగా ‘ఇన్‌షా అల్లా’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆలియా భట్‌ కథానాయికగా నటించనున్నారు.

ఈ సినిమాలో ఫ్లోరిడాకు చెందిన నలభై ఏళ్ల బిజినెస్‌మెన్‌గా సల్మాన్‌ నటించబోతున్నారని బాలీవుడ్‌ సమాచారం. ఆగస్టు చివరి వారంలో ఆరంంభం కానున్న ఈ సినిమా షూటింగ్‌ కోసం ఫ్లోరిడాలో లొకేషన్‌ హంట్‌ స్టార్ట్‌ చేశారు దర్శకుడు భన్సాలీ. ఈ సినిమా వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది. ప్రస్తుతం ‘దబాంగ్‌ 3’ సినిమాతో బిజీగా ఉన్నారు సల్మాన్‌ఖాన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement