
సల్మాన్‌ఖాన్! మనోడికి ఫ్లేమ్‌లు ఉండవు. అన్నీ ఎక్స్ ఫ్లేమ్‌లే. ఫ్లేమ్ అంటే ఏంటీ అనుకుంటు న్నారా? అగ్గి రాజేసే ప్రియురాలు. ‘ఏక్ థా టైగర్’ అనే సీక్వెల్ సినిమాలో ఎక్స్ ఫ్లేమ్ కత్రినా కైఫ్‌తో పంజా విసరబోతున్నాడు. ఈ మధ్యే హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ప్రఖ్యాత జర్నలిస్ట్ శేఖర్ గుప్తాతో ముచ్చట్లేస్తూ, ‘‘సంజయ్ లీలా భన్సాలీ నాకు చెయ్యి చూపించాడు’’ అన్నాడు. అదెలా అనడిగితే, ‘‘సంజయ్‌కి నేను మూడు సూపర్ హిట్‌లు ఇచ్చా. ఖామోషీ, హమ్ దిల్‌దే చుకే సనమ్, సావరియా. కానీ, ‘దేవదాస్’ సినిమాలో మాత్రం నన్ను కాదని షారుక్ ఖాన్‌కి పాత్ర ఇచ్చాడు.
మరి అది చెయ్యి చూపించడం కాదా?’’ అన్నాడు. శేఖర్ గుప్తాకు విషయం అప్పటికప్పుడు అర్థం కాకపోయినా, తర్వాత జ్ఞానం ఉదయించింది. ‘ఓహో! దేవదాసులో హీరోయిన్ మనోడి ఎక్స్ ఫ్లేమ్ ఐశ్వర్యారాయ్ కదా’ అని! ఇదండీ.. సల్లూ భాయ్ ఎక్స్ ఫ్లేమ్‌ల పరంపర. భన్సాలీ చెయ్యి చూపించాడనే విషయం నవ్వుతూ చెప్పినా బిడ్డ ఎక్కడో లోతుగా కుమిలిపోతున్నాడని అనిపించింది. ఫ్లేమ్ గేమ్ కాస్తా.. బ్లేమ్ గేమ్ అయిందన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment