హిందీ సినీ పరిశ్రమలో వరుస విజయాలతో టాప్ ప్లేస్లో ఉన్న హీరోయిన్ దీపిక పదుకొనే. నటనతో పాటు గ్లామర్తో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ బ్యూటీని, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు. దీపిక ప్రస్తుతం బన్సాలీ దర్శకత్వంలో ఓ చారిత్రక చిత్రంలో నటిస్తుంది. 'బాజీరావ్ మస్తానీ' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మస్తానీగా కనిపించనుంది దీపిక.
పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా కావటంతో అప్పటి పరిస్థితులను సహజంగా చూపించటం కోసం నటీనటులకు మేకప్ వద్దంటున్నాడట దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ. నటుల వరకు ఈ నిబంధన ఓకే కానీ నటీమణులు విషయంలో కూడా ఇదే కండిషన్ పెట్టడంతో దీపిక లాంటి గ్లామర్ స్టార్స్ ఇబ్బంది పడిపోతున్నారు. అందాల రాణులుగా తమను చూస్తున్న ఆడియన్స్ మేకప్ లేకుండా చూస్తే అంగీకరించరేమో అని భయపడుతుంది దీపిక.
బాజీరావ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ ప్రియాంక కాశీబాయ్గా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న 'బాజీరావ్ మస్తానీ' సినిమాను డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.
హీరోయిన్ను మేకప్ వేసుకోవద్దన్న డైరెక్టర్
Published Wed, Sep 2 2015 12:07 PM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM
Advertisement
Advertisement