
Allu Arjun Meets Sanjay Leela Bhansali: పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గతేడాది డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప: ది రైజ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో బన్నీ పుష్ప రాజ్ అనే స్మగ్లర్‌గా కనిపించాడు. ప్రస్తుతం సెకండ్ పార్ట్ పుష్ప: ది రూల్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివర్లో పుష్ప పార్ట్ 2ను రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత కూడా బన్నీ పాన్ ఇండియా చిత్రాలపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
చదవండి: యాంకర్ రష్మీపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు, ఆమె కాల్ రికార్డు ఇంకా ఉంది
ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ కలిశాడు అల్లు అర్జున్. సోమవారం అల్లు అర్జున్ ముంబైలోని సంజయ్‌లీలా భన్సాలీని కలిశాడు. కార్యాలయానికి వెళ్లాడు. సంజయ్ లీలా భన్సాలిని కలిసేందుకు బన్నీ ఆయన కార్యాలయానికి వెళ్లి బన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ మారింది. బాలీవుడ్ టాప్ డైరెక్టర్‌ని ఐకాన్ స్టార్ ప్రత్యేకంగా కలవడంతో ఇటూ టాలీవుడ్, అటూ బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. భవిష్యత్తులో ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడం కోసమే సమావేశమయ్యారా? లేక ఇంకేదైనా కారణాలతో కలిశారా అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు.
చదవండి: Radhe Shyam Director: వారిపై ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ అసహనం
ఈ క్రమంలో త్వరలోనే వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారా? అని చర్చించుకుంటున్నారు. ఏదేమైన బన్నీ, సంజయ్ లీలా భన్సాలీతో సినిమా తీస్తే చాలా బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. సినిమాలను తెరకెక్కించడంలో సంజయ్ లీలా భన్సాలీకి ఓ ప్రత్యేక శైలి ఉంది. అలాంటి దర్శకుడి ఐకాన్ స్టార్ మూవీ అంటే ఏ రేంజ్‌లో ఉంటుందోనని ఇప్పుడు ఫ్యాన్స్ ముచ్చటించుకుంటున్నారు. రీసెంట్‌గా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'గంగూబాయి కతియావాడి' రిలిజై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో అలియా భట్ మెయిన్ లీడ్ రోల్ చేసింది.
Icon StAAr @alluarjun met with Bollywood top director #SanjayLeelaBhansali @ Mumbai today.#AlluArjun @bhansali_produc pic.twitter.com/ElELV7ddpo
— VamsiShekar ON DUTY (@UrsVamsiShekar) March 14, 2022