
సారీ చెప్పిన హీరోయిన్
ముంబైః మాట జారి తప్పు చేశానని బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా అంగీకరించింది. ట్విట్టర్ ద్వారా సరబ్జిత్ సింగ్‌పై అనుచితంగా వ్యాఖ్యానించినందుకు చింతిస్తున్నట్లుగా ఆమె పేర్కొంది. దీంతో పాటు బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పింది. ఇలా క్షమాపణలు చెప్పడం చిన్నతనం కాదనీ, హుందాతనమని ఈ దబాంగ్ భామ పేర్కొంది.
వివరాల్లోకి వెళితే సరబ్‌జిత్ సింగ్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నట్లుగా ఓ యువతి.. అతని ఫొటోని సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో ఈ బాలీవుడ్ భామ కూడా స్పందించింది. ఆ ఫొటోలోని వ్యక్తిని తిడుతూ కామెంట్ పోస్ట్ చేసింది. క్షణాల్లో ఈ ఫొటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో పోలీసులు సరబ్‌జిత్ సింగ్‌ని అరెస్ట్ చేశారు. అయితే ఆ యువతి కావాలనే సరబ్‌జిత్ సింగ్‌పై తప్పుడు ఆరోపణలు చేసినట్లుగా ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాలో వెల్లడించారు. దీంతో తప్పు తెలుసుకున్న సోనాక్షి తాను తొందరపడ్డానంటూ క్షమాపణలు తెలిపింది.
Admitting a mistake and apologizing doesn't make anyone a smaller person...thats what I've been taught! https://t.co/3hQtJcPhHg
— Sonakshi Sinha (@sonakshisinha) August 27, 2015