పారిపోయిన పెళ్లికూతురి కోసం..! | Sonakshi Sinhas Happy Phirr Bhaag Jayegi Trailer | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 25 2018 3:36 PM | Last Updated on Wed, Jul 25 2018 5:52 PM

Sonakshi Sinhas Happy Phirr Bhaag Jayegi Trailer - Sakshi

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా మరో డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. దబాంగ్‌ లాంటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌తో వెండితెరకు పరిచయం అయిన సోనాక్షి తరువాత సినిమాల ఎంపికలో కొత్తగా ఆలోచిస్తున్నారు. కేవలం గ్లామర్‌షోకు పరిమితమైపోకుండా నటనకు అవకాశమున్న పాత్రల్లో ఆకట్టుకుంటున్నారు. అదే బాటలో త్వరలో హ్యాపీ ఫిర్‌ బాగ్‌ జాయేగీ సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నారు.

కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ నిర్మిస్తుండగా ముదస్సర్‌ అజీజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పారిపోయిన పెళ్లికూతురు హ్యాపి సోనాక్షి అనుకొని ఆమెను పట్టుకోవటం తరువాత నిజం తెలుసుకోని హ్యాపిని పట్టుకునేందుకు సోనాక్షి సాయం చేయటం అనే కథతో ఈ సినిమా రూపొందుతోంది. డయానపెంటీ, పియూష్ మిశ్రా, జిమ్‌ శెర్గిల్‌, అభయ్‌ డియోల్‌ అలీ ఫజల్‌లు ఇతర కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement