మనందరం ఖాళీ సమయాల్లో ఏం చేస్తాం? పుస్తకాలు చదువుతాం, లేదా సినిమాలు చూస్తాం. లేదా వేరే ఏదైనా చేస్తాం. మరి మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు? అనే ప్రశ్నను సోనాక్షీ సిన్హా ముందుంచితే – ‘‘కుంచె పట్టుకొని బొమ్మలు గీసేస్తా అంటున్నారు. చిన్నప్పుడు నా బుక్స్ నిండా చిన్న చిన్న బొమ్మలే ఉండేవి. నేను చిన్నప్పటి నుంచి బొమ్మలు బాగా గీసేదాన్ని. సంవత్సరం క్రితం నుంచి స్కెచ్‌లు మరియు కలర్స్‌తో ప్రయోగాలు మొదలెట్టాను. ఈ మధ్యనే అబస్ట్రాక్ట్ ఆర్ట్ (ఆకారం లేకుండా రంగులతో భావ వ్యక్తీకరణ చేసే కళ)తో మొదలెట్టి యానిమల్స్, ఉమెన్ ఫేస్‌లు గీస్తున్నా.
రీసెంట్‌గా నేను గీసిన బొమ్మలను బ్రెస్ట్ క్యాన్సర్ భాదితుల విరాళం కోసం వేలం వేశాను. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి స్వచ్ఛంద సేవల కోసం నా డ్రాయింగ్స్ వాడదలుచుకున్నాను. బొమ్మలు గీయటం నాకు ఓ మెడిటేషన్ లాంటిది. ఈ మధ్య నా స్నేహితులకు నేను గీసిన పెయింటింగ్స్ బహుమతిగా ఇచ్చాను. ఇప్పుడు ఆ విషయం అందరికీ తెలిసిపోయి ‘మాకో గిఫ్ట్ ప్లీజ్’ అంటున్నారు. వాళ్ళ కోసమైనా తరచుగా గీయాల్సి వస్తోంది’’ అని నవ్వుతూ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment