సోనాక్షితో ఇంటిమేట్‌ సీన్స్‌.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు | Heeramandi Indresh Malik Comments On Sonakshi Sinha | Sakshi
Sakshi News home page

సోనాక్షితో ఇంటిమేట్‌ సీన్స్‌.. ఆమె మదర్ ఏమన్నారంటే: నటుడు

Published Mon, May 6 2024 6:47 PM | Last Updated on Mon, May 6 2024 7:38 PM

Heeramandi Indresh Malik Comments On Sonakshi Sinha

బాలీవుడ్‌ టాప్‌ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మొట్టమొదటి వెబ్‌ సిరీస్‌ హీరామండి: ది డైమండ్‌ బజార్‌. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌ హిట్‌ టాక్‌తో స్ట్రీమింగ్‌ అవుతుంది. మే 1నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అలరిస్తుంది. ఇందులో మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌  తదితరులు నటించారు.

హీరామండి వెబ్‌ సిరీస్‌లో ఉస్తాద్‌జీ పాత్రలో మెప్పించిన ఇంద్రేష్ మాలిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఇందులో సోనాక్షి సిన్హాతో  ఇంటిమేట్‌ సీన్‌  గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చాడు.

‘సోనాక్షీకి, నాకు మధ్య ఉన్న ఇంటిమేట్‌ సీన్స్ కోసం ఎక్కువ రీటేక్‌లు తీసుకోలేదు. ఈ సీన్స్‌ తీస్తున్న సమయంలో నేను భయాందోళనకు గురైయాను.  కాస్త సిగ్గుగా కూడా అనిపించింది.  కానీ,  సోనాక్షీ నాతో మాట్లాడి రిలాక్స్‌గా ఉండమని కోరారు. ఈ సీన్స్‌ కూడా ఆమె అమ్మగారి ముందే జరిగాయి. ఈ క్రమంలో సోనాక్షీ తల్లి ముందే నాతో మాట్లాడారు. ఈ సిరీస్‌లో ఇలాంటి సీన్లు అవసరం, కంగారు పడొద్దని చెప్పారు. సుమారు గంటకు పైగానే అందరం చర్చించుకున్నాకే షూట్‌ మొదలపెట్టాం. అందుకే ఎక్కువ రీటేక్‌లు తీసుకోలేదు. ఈ సిరీస్‌లో నా పాత్ర చాలా కీలకం.  ఆ పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇది నా కోసమే రూపొందించబడిందని నేను అనుకుంటున్నాను. సంజయ్‌ భన్సాలీ ప్రతీ సీన్‌ను చాలా జాగ్రత్తగా తీశారు.

మరోక సన్నివేశంలో సోనాక్షి తన కాళ్లతో నా తలను టచ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆమె తల్లి పూనమ్ సిన్హా కూడా సెట్స్‌లో ఉన్నారు. ఆ సీన్‌ సమయంలో కాస్త ఇబ్బంది ఉన్నా.. ఆమె నాకు కొంత ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. ఇలాంటి ఎన్నో సీన్స్‌ మా మధ్య ఉన్నాయి. హీరామండి సెట్ నుంచి నాకు చాలా అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి.' అని ఇంద్రేష్ మాలిక్ చెప్పాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement