బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హాపై ఎఫ్‌ఐఆర్‌ | FIR Filed Against Sonakshi Sinha For Cheating | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హాపై ఎఫ్‌ఐఆర్‌

Published Sun, Feb 24 2019 2:38 PM | Last Updated on Wed, Apr 3 2019 7:12 PM

FIR Filed Against Sonakshi Sinha For Cheating - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హాపై చీటింగ్‌ కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఓ ఈవెంట్‌ సంస్ధ నుంచి డబ్బులు తీసుకుని కూడా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సదరు కార్యక్రమానికి గైర్హాజరు కాకపోవడంతో నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోనాక్షి సహా 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సోనాక్షి సిన్హా గత ఏడాది సెప్టెంబర్‌ 30న కార్యక్రమానికి హాజరయ్యేందుకు రూ 37 లక్షలు తీసుకున్నారని, అయితే చివరినిమిషంలో ఈవెంట్‌లో ఆమె పాల్గొనలేదని ఆరోపిస్తూ ఆర్గనైజర్లు ఫిర్యాదు చేయడంతో సోనాక్షి సహా ఐదుగురిపై చీటింగ్‌ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో బాలీవుడ్‌ నటితో పాటు అభిషేక్‌ సిన్హా, మాళవిక పంజాబి, ధుమిల్‌ ఠక్కర్‌, ఎద్గార్‌ల పేర్లు పొందుపరిచామని మొరదాబాద్‌ డీఎస్పీ గజ్‌రాజ్‌ సింగ్‌ తెలిపారు. ఈవెంట్‌ నిర్వాహకుల ఫిర్యాదుపై తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement