స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత ఎప్పుడూ ఆ ప్రీఫిక్స్ అవసరం రానివ్వకుండానే కెరీర్‌ని మలచుకుంది సోనాక్షి సిన్హా.. కేవలం తన టాలెంట్‌తోనే! సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ పాత్రల ఎంపికలో తన స్టయిల్ ప్రత్యేకమని చాటుకుంది. ఫ్యాషన్‌లోనూ ఆ స్టయిల్‌నే క్రియేట్ చేసుకున్న ఆమె ఫాలో అయ్యే బ్రాండ్స్ కొన్ని..‘ఎలాంటి సమస్యకైనా పనిని మించిన మందు లేదు. ఇది నేను అనుభవంతో చెబుతున్న మాట. తీరిక సమయాల్లో నా కాలక్షేపం.. జిమ్‌లో గడపడం, పెయింటింగ్, స్కెచెస్ వేయడం, సినిమాలు చూడడమే!
ఏకే – ఓకే...
ఫ్యాన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయాలన్న అనామికా ఖన్నా తపనకు.. కోల్‌కతాలోని ఆమె డిజైనర్ స్టోర్ అద్దం పడుతోంది. భారతీయ సంప్రదాయ వస్త్రాల పద్ధతులకు పాశ్చాత్య ధోరణులను మిక్స్ చేసి సరికొత్త డిజైన్స్‌ను రూపొందించడం అనామికా ప్రత్యేకత. అదే అమెను.. వారానికో డ్రెస్ కూడా అమ్ముడవని రోజుల నుంచి సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, దీపికా పడుకోణ్, ఐశ్వర్య రాయ్ లాంటి సెలబ్రిటీలు అనామికా డిజైనర్ వేర్‌లో ఒక్కసారైనా మెరిసిపోవాలని ఆశపడే స్థాయికి ఎదిగేలా చేసింది. ఆపై తన బ్రాండ్ నేమ్‌ని పలు దేశాలకూ విస్తరింపజేసి తిరుగులేని ఫ్యాషన్ డిజైనర్‌గా మారింది. సామాన్యులు వీటి ధరలను అందుకోవడం కష్టమే. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. సోనాక్షి సిన్హా ధరించి ఏకే ఓకే డ్రస్ ధర రూ. 38,000/-
క్యూరియో కాటేజ్..
ఇదొక మహిళల బ్రాండ్! ఇక్కడ పనిచేసేవారందరు కూడా మహిళలే! ఒకరకంగా చెప్పాలంటే మహిళల చేత మహిళల కోసం రూపుదిద్దుకున్న ప్రత్యేక బ్రాండ్ ఇది. అందుకే ఇక్కడ లభించే ఏ డిజైన్‌ను చూసినా వెంటనే ప్రేమలో పడిపోతారు. 1971లో ఏక్తా బఠీజా ప్రారంభించిన ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రస్తుతం వారి మూడోతరం వారసులు అదే ప్యాషన్‌తో కొనసాగిస్తున్నారు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. సోనాక్షి సిన్హా ధరించిన జ్యూలరీ ధర రూ. 23,990/-, ఉండగం ధర రూ. 6,990/-
---దీపిక కొండి
Comments
Please login to add a commentAdd a comment