
ముంబై : బాలీవుడ్‌లో వివాదాలకు దూరంగా ఉండే హీరోయిన్లలో ముందువరుసలో నిలిచే సోనాక్షి సిన్హా తన వ్యక్తిగత జీవితం గురించి తొలిసారిగా పెదవివిప్పారు. తాను గతంలో ఓ సెలబ్రిటీతో డేటింగ్‌లో ఉన్నానని, తమ ప్రేమ వ్యవహారం గురించి ఎవరికీ తెలియదని వెల్లడించారు. సినీ ఇండస్ర్టీ వ్యక్తితో ఎవరితోనైనా డేటింగ్ చేశారా అని సోనాక్షిని ఓ చాట్ షోలో ప్రశ్నించగా ఓ మంచి యువకుడితో తాను డేటింగ్ చేయాలని సినీ పరిశ్రమలోనే ఏ ఒక్కరూ భావించని రీతిలో తన తల్లితండ్రులు కోరుకున్నారని చెప్పుకొచ్చారు.
గతంలో సినీ పరిశ్రమకు చెందిన ఓ సెలబ్రిటీతో తన ప్రేమ వ్యవహారం గురించి ఆమె వెల్లడించారు. అయితే తమ డేటింగ్ గురించి ఎవరికీ తెలియదని చెప్పిన సోనాక్షి ఆ సెలబ్రిటీ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. రిలేషన్‌షిప్‌లో మోసాలను మాత్రం తాను సహించనని ఆమె తేల్చిచెప్పారు. తనను తన భాగస్వామి మోసం చేస్తే మరుసటి రోజును అతడు చూడలేడని చెప్పడం గమనార్హం. తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment