
నితీశ్‌ను కలిసిన శత్రుఘ్న సిన్హా
బిహార్‌లో ప్రధాని మోదీ పర్యటన ముగిసిన కొద్ది గంటల వ్యవధిలోనే బీజేపీ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు శత్రుఘ్న సిన్హా ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో భేటీ కావటం చర్చనీయాంశమైంది.
పట్నా: బిహార్‌లో ప్రధాని మోదీ పర్యటన ముగిసిన కొద్ది గంటల వ్యవధిలోనే బీజేపీ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు శత్రుఘ్న సిన్హా ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో భేటీ కావటం చర్చనీయాంశమైంది. శనివారం సాయంత్రం నితీశ్‌తో మంతనాలు జరిపిన సిన్హా బిహార్ సంరక్షకుడిగా నితీశ్‌ను అభివర్ణించటం గమనార్హం. పట్నాకు కేవలం 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజఫర్‌పూర్‌లో జరిగిన మోదీ ర్యాలీలో కూడా ఆయన పాల్గొనలేదు. ర్యాలీలో పాల్గొనాలంటూ తనకు ఆహ్వానం అందలేదన్నారు.
మోదీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచీ తనకు సరైన ప్రాధాన్యం లభించలేదని సిన్హా అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. అయితే నితీశ్‌తో తన భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని సిన్హా అన్నారు.