దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న హీరోయిన్ సాయి పల్లవి. వచ్చిన అవకాశాలను కాకుండా నచ్చిన పాత్రలనే అంగీకరించి నటించే అతి కొద్దిమంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఈమె ఇప్పటివరకు లభించిన చిత్రాలన్ని అలాంటివే. గార్గీ వంటి మూవీ సక్సెస్ తర్వాత సాయి పల్లవి ఇప్పటి వరకు తెరపై కనిపించలేదు అంతకుముందు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన సాయి పల్లవి చాలా రోజులు సినిమాలేవీ లేకుండానే ఖాళీగానే ఉంది. అలా పలు అవకాశాలను తిరస్కరించిన ఈ సహజ నటికి తాజాగా భారీ బ్రహ్మాండ కథా చిత్రంలో నటించే అవకాశం వరించింది.
(ఇది చదవండి: ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్‌డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే!)
అదీ పాన్ ఇండియా స్థాయిలో రామాయణం వంటి ఇతిహాసం నేపథ్యంలో రూపొందనున్న చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా సాయి పల్లవి అదృష్టమే అని చెప్పొచ్చు. అవును హిందీతో సహా పలు భాషల్లో అత్యంత భారీ బడ్జెట్లో రూపొందబోతున్న రామాయణం చిత్రంలో సాయి పల్లవి సీతగా నటించనున్నారు. ఈ చిత్రం గురించి అనధికారికంగా ఇప్పటివరకు చాలా ప్రచారం జరిగింది. కాగా నటి సాయి పల్లవి తొలిసారిగా రామాయణం చిత్రంలో సీతగా నటించబోతున్న విషయాన్ని దర్శకుడు నితీష్ తివారి తనను సీతగా ఎలా చూశారు అన్న భావనే తనను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందన్నారు.
ఇది నిజంగానే తనను వరించిన అరుదైన అదృష్టంగా పేర్కొన్నారు. ఈ చిత్రం షూటింగ్‌కు ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఇది కచ్చితంగా తనకు సవాల్‌తో కూడిన పాత్ర అని పేర్కొన్నారు. ఎందరో ప్రఖ్యాత నటీమణులు పోషించిన పాత్ర అని.. వారు నటించిన దాంట్లో తాను 10 శాతం చేసిన బాగా నటించినట్లే అని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం కథ వినడానికి త్వరలోనే ముంబయికి వెళుతున్నట్లు చెప్పారు. కాగా ఇప్పటికే భారతీయ సినీ చరిత్రలో పలు రామాయణం గ్రంథాలు చిత్రాలుగా రూపొందాయని, ఇప్పటివరకు వాల్మీకి రామాయణాన్ని ఎవరు సంపూర్ణంగా తెరపై ఆవిష్కరించలేదని.. ఆ కొరతను తమ రామాయణం తీరుస్తుందనే భావనను వ్యక్తం చేశారు. కాగా ఈ రామ చరితం నేపథ్యంలో రామాయణం చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
(ఇది చదవండి: శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి)
Comments
Please login to add a commentAdd a comment