రామాయణంకి ఎంతైనా కష్టపడతాను: యశ్‌  | Yash on why he is coproducing Nitesh Tiwari Ramayana | Sakshi
Sakshi News home page

రామాయణంకి ఎంతైనా కష్టపడతాను: యశ్‌ 

Published Sat, Apr 13 2024 3:45 AM | Last Updated on Sat, Apr 13 2024 3:45 AM

Yash on why he is coproducing Nitesh Tiwari Ramayana - Sakshi

‘‘నమిత్, నేను కలిసి రామాయణంపై మూవీ చేస్తే బాగుంటుందని చాలా సార్లు అనుకున్నాం. కానీ, అంత పెద్ద సబ్జెక్టు తియ్యాలంటే అది మామూలు విషయం కాదు.. బడ్జెట్స్‌ కూడా సరిపోవు.. అందుకే నేను కూడా కో ప్రోడ్యూస్‌ చెయ్యాలనుకున్నాను. ఈ ‘రామాయణం’ కోసం ఎంతైనా కష్టపడతాను’’ అన్నారు ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ హీరో యశ్‌. ఆయన నిర్మాణ సంస్థ మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్, నిర్మాత నమిత్‌ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌ కలిసి రామాయణం నేపథ్యంలో ఓ సినిమా నిర్మించనున్నాయి.

ఈ చిత్రానికి నితీష్‌ తివారి దర్శకుడు. నమిత్‌ మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తీయడంలో న్యాయం చేయగలను అనిపిస్తోంది’’ అన్నారు. కాగా నితీష్‌ తివారి దర్శకత్వంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయి పల్లవి ‘రామాయణ్‌’ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రానికే నమిత్‌ మల్హోత్రా, యశ్‌ నిర్మాతలనే టాక్‌ వినిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement