Mahabharata's Nitish Bhardwaj reacts to 'Oppenheimer' Bhagavad Gita controversy - Sakshi
Sakshi News home page

Nitish Bharadwaj: 'అతని ఆలోచన అది కాదు'.. భగవద్గీత సీన్‌పై మహాభారత్‌ నటుడు!

Published Tue, Jul 25 2023 5:33 PM | Last Updated on Tue, Jul 25 2023 6:06 PM

Nitish Bharadwaj reacts to the Oppenheimer Bhagwad Gita Controversy - Sakshi

ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన చిత్రం ఓపెన్ హైమర్. జూలై 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఇండియాలోను విడుదల కావడంతో ఈ సినిమాకు ప్రేక్షాదరణ పెరుగుతోంది. అయితే ఈ చిత్రంలోని ఓ సన్నివేశం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలోని ఓ సీన్‌లో భగవద్గీత గురించి ప్రస్తావించడంపై ఇండియన్స్ మండిపడుతున్నారు. అలాంటి సీన్స్‌లో భగవద్గీతను చూపించాల్సిన అవసరం ఏంటని పలువురు నిలదీస్తున్నారు.

ఆ సీన్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రముఖ హిందీ బుల్లితెర నటుడు  నితీశ్ భరద్వాజ్ స్పందించారు. ఆయన శ్రీకృష్ణ, మహాభారతం సీరియల్స్‌లో కృష్ణుడి పాత్ర పోషించారు. అయితే ఆ సన్నివేశంలో ఎలాంటి తప్పులేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలోని వివాదాస్పద సన్నివేశాన్ని ఆయన సమర్థించారు. అణుబాంబు సృష్టితో జపాన్‌లో పెద్దసంఖ్యలో ప్రజలు మరణించారని.. ఆ సమయంలో ఆయన ఆందోళనకు గురయ్యారని వివరించారు. 

(ఇది చదవండి: రాజకీయాల్లోకి స్టార్‌ హీరో.. ఆయన చేతుల్లో ఉందన్న నటుడు!)

ఇంటర్వ్యూలో నితీష్ భరద్వాజ్ మాట్లాడుతూ..'జపాన్ జనాభాలో మెజారిటీ ప్రజలు నాశనం కావడానికి కారణంఅణు బాంబు. అలాంటి మారణహోమానికి కారణమైన ఓపెన్ హైమర్ పశ్చాత్తాప పడ్డారు. ఆ సంఘటన అతనికి కన్నీళ్లను తెప్పించింది.  దీంతో అతని చేసిన తప్పుకు చింతిస్తున్నాడు. గతంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమవడం నేను చూశా. ఒక శాస్త్రవేత్త తన పరిశోధనల గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు. ఆయన కోణం నుంచి ఆ సీన్‌ చూడాలి. అది శృంగార సన్నివేశమైనప్పటికీ.. అతని ఆలోచనలన్నీ జరిగిన విధ్వంసంపైనే ఉన్నాయని చూపించే ప్రయత్నం చేశారు. అతనిది మానసిక సంఘర్షణ. ఆ సన్నివేశాన్ని వివాదం చేయకుండా..ఓపెన్‌ హైమర్‌ భావోద్వేగం కోణంలో చూడాలని ప్రజలను కోరుతున్నా.' అంటూ సలహా ఇచ్చారాయన. 

కాగా.. కై బర్డ్, మార్టిన్ J షెర్విన్ రాసిన 2005 జీవిత చరిత్ర అమెరికన్ ప్రోమేథియస్: ది ట్రయంఫ్ అండ్ ట్రాజెడీ ఆఫ్ J రాబర్ట్ ఓపెన్‌హైమర్  ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ చిత్రంలో రామి మాలెక్, గ్యారీ ఓల్డ్‌మన్, డేన్ డెహాన్, జోష్ హార్ట్‌నెట్, కెన్నెత్ బ్రానాగ్, మాథ్యూ మోడిన్, కేసీ అఫ్లెక్, ఆల్డెన్ ఎహ్రెన్‌రిచ్, జాసన్ క్లార్క్ ప్రధాన పాత్రలు పోషించారు. 

(ఇది చదవండి: సినిమాల్లో నటనే కాదు.. అమ్మతనం ఉట్టి పడుతోంది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement