బ్రిటిష్‌ అకాడమీ ఫిలిం అవార్డ్స్‌ 2024 విన్నర్స్‌.. ఆ హిట్‌ సినిమాదే పైచేయి | Sakshi
Sakshi News home page

బ్రిటిష్‌ అకాడమీ ఫిలిం అవార్డుల్లో ఆ సినిమాదే పైచేయి

Published Mon, Feb 19 2024 10:37 AM

77th British Academy Film Awards List - Sakshi

క్రిస్టోఫర్ నోలన్ ఆధారంగా తెరకెక్కిన ఓపెన్‌హైమర్ బయోపిక్ మరోసారి రికార్డు క్రియేట్‌ చేసింది. 77వ బ్రిటిష్‌ అకాడమీ ఫిలిం అవార్డు (BAFTA) వేడుకల్లో తన సత్తా చాటింది. 2024 ఏడాదికి సంబంధించి ఓపెన్‌హైమర్ అవార్డ్స్‌లో అగ్రగామిగా నిలిచింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు సహా ఏడు అవార్డులను గెలుచుకుంది. నోలన్‌కు దర్శకుడిగా ఇదే తొలి BAFTA అవార్డు కావడం విషేశం.

బాఫ్టా ఫిల్మ్ 2024 అవార్డుల వేడుక లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో జరిగింది. పూర్ థింగ్స్ లో తన నటనకు గాను ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఓపెన్ హైమర్‌లో మనోజ్ఞ నటనకు సిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. పూర్ థింగ్స్ చిత్రానికి సంబంధించి కాస్ట్యూమ్, మేకప్, హెయిర్-స్టైలింగ్, ప్రొడక్షన్, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ వంటి విభాగాల్లో ఐదు బాఫ్టా అవార్డులను పొందింది.  

ఇప్పటికే అత్యధిక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు గెలుచుకున్న 'ఓపెన్‌హైమర్‌' వచ్చే నెలలో జరిగే ఆస్కార్‌ రేసులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఇవన్నీ చూస్తే ఈసారి ఆస్కార్‌ అవార్డుల్లో ఓపెన్‌హైమర్ పంట పండటం ఖాయం అని చెప్పవచ్చు.

BAFTA అవార్డు విజేతలు

ఉత్తమ చిత్రం: ఓపెన్‌హైమర్‌
ఉత్తమ దర్శకుడు:  క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌హైమర్‌)
ఉత్తమ నటుడు:  సిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)
ఉత్తమ నటి:  ఎమ్మా స్టోన్‌ (పూర్‌ థింగ్స్‌)
ఉత్తమ సహాయ నటుడు:  రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ (ఓపెన్‌హైమర్‌)
ఉత్తమ సహాయ నటి:  డావిన్‌ జాయ్‌ రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)
ఉత్తమ కాస్ట్యూమ్: హోలీ వాడింగ్టన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ బ్రిటిష్ చిత్రం: జోనాథన్ గ్లేజర్, జేమ్స్ విల్సన్ (క్రాబ్ డే)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: హోట్‌ వాన్‌ హోటిమా (ఓపెన్‌హైమర్‌) 
ఉత్తమ ఎడిటింగ్: జెన్నిఫర్ లేమ్ (ఓపెన్‌హైమర్) 
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రిట్, ఆర్థర్ హరారి (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ )
ఉత్తమ విజువల్స్: సైమన్ హ్యూస్ (పూర్ థింగ్స్ )
ఉత్తమ డాక్యుమెంటరీ:  20 డేస్‌ ఇన్‌ మరియోపోల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement