దేశంలో మరోమారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 293 సీట్లు, ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఎన్డీఏ మిత్రపక్షం అయిన జేడీయూ బీహార్‌లో 12 సీట్లు గెలుచుకుంది. ఇవి ఎన్డీఏకు చాలా కీలకం.
ఈ నేపధ్యంలో జేడీయే నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీ నుంచి మూడు మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేసినట్లు సమాచారం. బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాతో పాటు నలుగురు ఎంపీలకు ఒక మంత్రిత్వ శాఖ అనే ఫార్ములాను ప్రధాని మోదీ ముందు ఉంచారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. నితీష్ కుమార్ రైల్వే, వ్యవసాయం, ఆర్థిక మంత్రిత్వ శాఖలను కోరుకుంటున్నారని తెలుస్తోంది. దీనిలో రైల్వే మంత్రిత్వ శాఖపై పట్టుపడతారని అంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు గెలుచుకుని, మెజారిటీకి దూరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 12 సీట్లు గెలిచిన నితీష్ కుమార్(జేడీయూ), 16 సీట్లు గెలిచిన చంద్రబాబు నాయుడు(టీడీపీ) ఎన్డీఏకు కీలకంగా మారారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఇద్దరు నేతల అవసరం బీజేపీకి ఎంతైనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment