pyjama
-
పైజామా పార్టీలో కరీనా కపూర్ ధరించి డ్రెస్ ధర వింటే..నోరెళ్లబెట్టాల్సిందే
బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ గా ఒకప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న వారిలో కరీనా కపూర్ ఒకరు. 42 ఏళ్ళ వయసులో ఉన్నా కూడా ఇంకా తన ఫిట్నెస్ తో ఆశ్చర్యపరిస్తూనే ఉంటుంది. తన అందంతో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌ను ఆకట్టుకునేలా ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే..సైఫ్ అలీ ఖాన్ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లకు జన్మనిచ్చింది. అయినప్పటికి.. కుర్ర హీరోయిన్లకు తీసుపోని విధంగా గ్లామరస్ లుక్‌ని మెయింటెయిన్ చేయడం విశేషం. ఇక ఆమె నటించిన గర్ల్స్ గ్యాంగ్ ఆన్ గర్ల్‌ఫ్రెండ్స్ మూవీ మంచి సక్సెస్‌ని అందుకుని కరీనా కపూర్‌కి మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఈ సినిమా సక్సెస్‌తో ఆమె ఖాతాలో మరో బ్లాక్ బాస్టర్ మూవీగా చేరడం విశేషం. ఈ నేపథ్యంలో కరీనా కపూర్ తన మూవీ సిబ్బందితో మూవీ సక్సెస్‌ని జరుపుకుంది. అందుకోసం జరిగిన పైజామా పార్టీలో కరీనా ప్రసిద్ధ కఫ్తాన్ గర్ల్ ఫర్ లైఫ్ బ్రాండ్‌డ్ పైజామాలో మెరిసింది. రాత్రి సమయంలో ధరించే సౌకర్యవంతమైన పైజామా ఇది. అందులో ఆమె ముఖానికి మేకప్ లేకుండా నేచురల్‌గా, వదులుగా ఉన్న జుట్టుతో ఆకర్షించింది. ఈ పైజామాలో ఆమె లుక్ అత్యంత నేచురల్‌గా మతిపోగొట్టేలా ఉంది. ఆమె తోపాటు కరిష్మా కపూర్, మలైకా అరోరా, అమృతా అరోరా మరియు మాలికా భట్లు కూడా తమదైన డిజైన్ వేర్లలో సందడి చేశారు. కానీ అంతమంది అందాల భామల్లో కరీనా దుస్తులు హైలెట్‌గా నిలవడమే గాక ప్రధాన ఆకర్షణగా ఆమె లుక్ కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక కరీనా ధరించిన ఆ డ్రెస్ ధర ఏకంగా రూ. 1,78,006 పలుకుతుందట. ఈ డిజైన్వేర్ని ప్రింటెడ్ సిల్క్ క్రేప్ డి చైన్ కఫ్తాన్ అని పిలుస్తారట. నైట్ టైంలో సౌకర్యవంతంగా ధరించే పైజామా అంత ఖరీదా?.. అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయినా కరీనా అంటే ఆ మాత్రం రేంజ్లో ధర ఉండాల్సిందే అని మరి కొందరూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Karisma Kapoor (@therealkarismakapoor) (చదవండి: ఐశ్వర్య అందమంతా చీరలోనే.. ధరెంతో తెలుసా?) -
పెళ్లికూతురు ముందు పరువు పోగొట్టుకున్న పెళ్లికొడుకు.. వీడియో వైరల్..
పెళ్లి వేడుక అంటేనే ఆహ్లాదకరంగా సందడి వాతావరణం ఉంటుంది. అయితే ఒక్కోసారి వేదికపైనే నవ్వూలు పూయించే ఘటనలు జరుగతుంటాయి. అక్కడున్న వారిని పొట్టచెక్కలయ్యేలా నవ్వేలా చేస్తాయి. ఓ విహవా వేడుకలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కొత్త పెళ్లి కొడుక్కు తన జీవిత భాగస్వామి ముందే ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో అతడ్ని చూసి ఆమె పొట్టచెక్కలయ్యేలా నవ్వింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో పెళ్లి అనంతరం పూలదండలు మార్చుకుంటున్నారు వధూవరులు. అయితే పెళ్లికూతురు మెడలో దండ వేసే సమయంలో పెళ్లికొడుకు పైజామా జారిపోయింది. అతను మాత్రం గమనించలేకపోయాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్లతో పాటు పెళ్లికూతురు కూడా నవ్వడంతో వెంటనే తేరుకుని ప్యాంటు పైకి లాక్కున్నాడు. ఈ సమయంలో అతను సిగ్గుపడటం చూసి పెళ్లికి వచ్చిన వారంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. ये दूल्हे के साथ क्या हो गया !!! 😂😂😂😂😂😂😂 pic.twitter.com/RSELxUTzQ9 — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) March 16, 2023 ఈ వీడియోపై స్పందిస్తూ.. పాపం ఈ పెళ్లికొడుకుకు ఏమైంది? అని నెటిజన్ నవ్వులు పూయించాడు. ప్యాంటు లూస్‌గా ఉన్నట్టుంది బ్రో.. కొంచెం చూసుకోవాలి కదా అంటూ మరో యూజర్ చమత్కరించాడు. అయ్యో.. పెళ్లికూతురు ముందు పరువుపాయే.. మున్ముందైనా జర చూసుకో.. అంటు మరో యూజర్ సలహా ఇచ్చాడు. చదవండి: ఇన్స్టాంట్ ఖర్మ అంటే ఇదే.. గేదెను తన్ని బైక్‌పై నుంచి జారి.. -
ప్రతిభ ఉంటే ప్రపంచంలో ఏ మూలన ఉన్నా పాపులర్ కావొచ్చని నిరూపిస్తోంది శిర్లే సెటియా
-
Social Star: పైజమా పాప్‌స్టార్ శిర్లే సెటియా.. ఆర్జే నుంచి సింగర్‌గా..
ప్రతిభ ఉంటే ప్రపంచంలో ఏ మూలన ఉన్నా పాపులర్ కావొచ్చని నిరూపిస్తోంది శిర్లే సెటియా. ఇండియాలో పుట్టినప్పటికీ పెరిగింది, చదువుకుంది అంతా ఆక్లాండ్‌లోనే. అయినా భారత సినిమా పాటలను ఆలపిస్తూ లక్షలాది శ్రోతల్ని తన స్వరంతో అలరిస్తోంది. ఇండో–కివీస్ నటిగానేగాక, డ్యాన్సర్‌గా, రేడియో జాకీగా, గాయనిగా, యూ ట్యూబర్ గా రాణిస్తోంది. షోటైమ్ విత్ శిర్లే.. హరియాణాకు చెందిన రాజ్, ఫిరోజా సెటియా దంపతుల ముద్దుల కూతురు శిర్లే సెటియా. శిర్లే ఇండియాలోనే పుట్టినప్పటికీ.. రాజ్ సెటియా వ్యాపార రీత్యా ఆక్లాండ్‌లో స్థిరపడడంతో....శిర్లే ఆక్లాండ్‌లోనే అడుగు వేయడం నేర్చుకుంది. తనకి షానే సెటియా అనే తమ్ముడు ఉన్నాడు. స్కూలులో చురుకైన విద్యార్థిగా పేరున్న శిర్లే చిన్నప్పుడు వ్యోమగామి కావాలని కలలు కనేది. కానీ స్కూలు విద్య పూర్తయ్యాక మార్కెటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో బీకామ్ చేసింది. డిగ్రీ అయ్యాక ఆక్లాండ్‌లో హిందీ కంటెంట్‌ను ప్రసారం చేసే రేడియో టరానాలో పార్ట్‌టైమ్ ఉద్యోగం లో చేరి పాపులర్ షో ‘షోటైమ్ విత్ శిర్లే’కు ఆర్జేగా పనిచేసింది. ఆర్జే నుంచి సింగర్‌గా.. తన గాత్రం మెరుగుపడ్డాక..2012లో శిర్లే సెటియా పేరుతో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. తను అప్లోడ్ చేసే పాటలకు మంచి స్పందన వచ్చేది. చిన్నప్పటి నుంచి న్యూజిలాండ్‌లో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ఇద్దరూ హిందీలో మాట్లాడడం వల్ల భారతీయ సినిమా పాటలపై శిర్లేకు అవగాహన ఉంది. చిన్నప్పటి నుంచి బాలీవుడ్ పాటలు వింటూ పెరగడంతో.. భారతీయ సంగీతంపై పట్టు ఏర్పడింది. దాంతో బాలీవుడ్ సినిమా పాటలు పాడి వాటిని తన చానల్లో అప్లోడ్ చేసేది. ఏడాది తరువాత టీ సీరిస్ ఏర్పాటు చేసిన యూ ట్యూబ్ కాంపిటీషన్లో పాల్గొంది. ఆషికీ –2లో అర్జిత్ సింగ్ పాడిన ‘‘హమ్ తేరే బిన్ అబ్ రహనహి సక్తే’’ కవర్ సాంగ్ వీడియోను రికార్డు చేసి తన చానల్లో అప్లోడ్ చేసింది. ఈ పాట బాగా వైరల్ అవడంతో టీ సీరిస్ పోటీలో విజేతగా నిలిచి, అధిక సంఖ్యలో వ్యూస్‌ను సంపాదించుకుంది. పైజమా పాప్‌స్టార్.. పాపులారిటీ తెచ్చిన హమ్ తేరే పాట వీడియో రూపొందించేటప్పుడు శిర్లే.. పైజమా ఉన్న డ్రెస్ ధరించి పాడింది. ఆ పాటతో బాగా పాపులర్ అవడంతో.. న్యూజిలాండ్ హెరాల్డ్ ‘పైజమా పాప్‌స్టార్’గా శిర్లేను వర్ణించింది. అప్పటినుంచి శిర్లే పైజమా స్టార్‌గా పాపులర్ అయ్యింది. దాంతో సబ్‌స్కైబ్రర్స్ సంఖ్య కూడా బాగా పెరిగింది. కోయ్ వి నహీ... రవిసింఘాల్తో కలిసి 2016లో తన తొలి కొయ్ షోర్ పాటను విడుదల చేసింది. మరుసటి ఏడాది బాలీవుడ్ సినిమా ‘ఏ జెంటిల్మెన్’లో ‘‘డిస్కో డిస్కో’’ పాడింది. ఈ పాటకు 54 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇదే ఏడాది తన సొంత పాటలు పాడాలని నిర్ణయించుకుని టీమ్‌తో కలిసి పంజాబీ ట్రాక్ ‘కోయ్ వి నహీ’ సాంగ్‌ను విడుదల చేసింది. ఇది యూట్యూబ్‌లో రికార్డులను బద్దలు కొట్టింది. అలా యూఎస్, యూకే, ఇండియా, కెనడాలలోని యూ ట్యూబ్ ఆరి్టస్టులతో కలిసి పాటలు పాడేది. పంజాబీ పాపులర్ సింగర్ గుర్నజర్తో కలిసి ఆమె విడుదల చేసిన ‘కోయ్ వీ నహీ’ పాటకు యూ ట్యూబ్‌లో180 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీనితోపాటు జబ్ కోయి బాత్, తు జో మిలా, బోల్ డో నా జరా, కుచ్ నా కహో, బారీష్ కవర్ సాంగ్‌లకు గుర్తింపు వచ్చింది. ‘మస్కా’ ‘నిక్ నేమ్’ వంటి సినిమాల్లో శిర్లే నటించినప్పటికీ గాయనిగానే తనకి మంచి గుర్తింపు వచ్చింది. అంతేగాక బాలీవుడ్ నెక్ట్స్ బిగ్ సింగింగ్ సెన్సేషన్‌గా ఫోర్బ్స్ మ్యాగజీన్ గుర్తించడం, మ్యూజిక్ సెన్సేషన్ ఇన్ సోషల్ మీడియా, న్యూజిలాండ్ సోషల్ మీడియా అవార్డులలో ‘బెస్ట్ ఇన్ మ్యూజిక్ అవార్డు, లాయిడ్ అండ్ అవుట్‌లుక్ ఇండియా సోషల్ మీడియా అవార్డులను అందుకుంది. ప్రస్తుతం శిర్లే యూ ట్యూబ్ చానల్‌కు దాదాపు నలభైలక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండగా, ఇన్స్టాగామ్ ఫాలోవర్స్ డెబ్భై లక్షలకు పైగా ఉన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Vajrasana Benefits: మానసిక ఒత్తిడి, వెన్నునొప్పి, ఎసిడిటీ నివారణకు.. యోగా మంత్రమిదే! -
గడ్కరీకి కుర్తా.. నితీష్‌కు పైజామా
రహదారి నిర్మాణ పనులపై ఎలాంటి ముందడుగు కనిపించకపోవడంతో కలతచెందిన బిహార్‌లోని ఓ స్థానిక ఎంఎల్ఏ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. సగం ప్యాంటు, బనీన్ను మాత్రమే ధరించి, తన కుర్తాను కేంద్ర రోడ్డు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి, పైజామాను బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు పంపి తన నిరసన తెలిపారు. బీహార్‌కు చెందిన ఎమ్ఎల్ఏ వినయ్ బిహారీ, గత మూడేళ్లుగా తమ నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జోగపట్టి మార్గాన్ని కలుపుతూ వెస్ట్ చంపారన్స్ మనుపుల్ నుంచి నావల్పుర్ రత్వాల్ చౌక్ మార్గాన్ని మీదుగా 44కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించాలని ఆయన సంకల్పించారు. కానీ ఈ రోడ్డు నిర్మాణ పనులపై కనీసం సీఎం నితీష్‌కుమార్ నుంచి కానీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నుంచి ఎలాంటి సహాయం అందలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినా వారినుంచి స్పందన కరువైంది. దీంతో ఇరు ప్రభుత్వాల తీరుపై విసుగెత్తిన ఆయన తన కుర్తాను నితిన్ గడ్కరీకి పంపుతూ ఓ లేఖను పంపారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేవరకు తాను కుర్తాను ధరించనని ఆ లేఖలో పేర్కొన్నారు. తన కుర్తా ఎలా ఉందో అలా భారతీయ జనతా పార్టీ అహంకారపూరిత వైఖరి కనిపిస్తుందన్నారు. అంతటితో ఆగకుండా తన పైజామాను సీఎం నితీష్‌కు పంపుతూ... మూడేళ్ల కిందట ఆయన ఇచ్చిన వాగ్దానాలపై మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల తర్వాత హామీలన్నింటినీ నితీష్ పక్కనబెట్టారని బాహాబాటంగా విమర్శించారు.