పైజామా పార్టీలో కరీనా కపూర్‌ ధరించి డ్రెస్‌ ధర వింటే..నోరెళ్లబెట్టాల్సిందే | Kareena Kapoor Khan Wears Rs 1 Lakh Worth Silk Kaftan | Sakshi
Sakshi News home page

Kareena Kapoor Khan:పైజామా పార్టీలో కరీనా కపూర్‌ ధరించి డ్రెస్‌ ధర వింటే..నోరెళ్లబెట్టాల్సిందే

Published Wed, Apr 3 2024 6:47 PM | Last Updated on Wed, Apr 3 2024 7:04 PM

Kareena Kapoor Khan Wears Rs 1 Lakh Worth Silk Kaftan - Sakshi

బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ గా ఒకప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న వారిలో కరీనా కపూర్ ఒకరు. 42 ఏళ్ళ వయసులో ఉన్నా కూడా ఇంకా తన ఫిట్నెస్ తో ఆశ్చర్యపరిస్తూనే ఉంటుంది. తన అందంతో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ను ఆకట్టుకునేలా ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే..సైఫ్ అలీ ఖాన్‌ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లకు జన్మనిచ్చింది. అయినప్పటికి.. కుర్ర హీరోయిన్లకు తీసుపోని విధంగా గ్లామరస్‌ లుక్‌ని మెయింటెయిన్‌ చేయడం విశేషం.

ఇక ఆమె నటించిన గర్ల్స్‌ గ్యాంగ్‌ ఆన్‌ గర్ల్‌ఫ్రెండ్స్‌ మూవీ మంచి సక్సెస్‌ని అందుకుని కరీనా కపూర్‌కి మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఈ సినిమా సక్సెస్‌తో ఆమె ఖాతాలో మరో బ్లాక్‌ బాస్టర్‌ మూవీగా చేరడం విశేషం. ఈ నేపథ్యంలో కరీనా కపూర్‌ తన మూవీ సిబ్బందితో మూవీ సక్సెస్‌ని జరుపుకుంది. అందుకోసం జరిగిన పైజామా పార్టీలో కరీనా ప్రసిద్ధ కఫ్తాన్‌ గర్ల్‌ ఫర్‌ లైఫ్‌ బ్రాండ్‌డ్‌ పైజామాలో మెరిసింది. రాత్రి సమయంలో ధరించే సౌకర్యవంతమైన పైజామా ఇది.

అందులో ఆమె ముఖానికి మేకప్‌ లేకుండా నేచురల్‌గా, వదులుగా ఉన్న జుట్టుతో ఆకర్షించింది. ఈ పైజామాలో ఆమె లుక్‌ అత్యంత నేచురల్‌గా మతిపోగొట్టేలా ఉంది. ఆమె తోపాటు కరిష్మా కపూర్, మలైకా అరోరా, అమృతా అరోరా మరియు మాలికా భట్‌లు కూడా తమదైన డిజైన్‌ వేర్‌లలో సందడి చేశారు. కానీ అంతమంది అందాల భామల్లో కరీనా దుస్తులు హైలెట్‌గా నిలవడమే గాక ప్రధాన ఆకర్షణగా ఆమె లుక్‌ కనిపించింది.

అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇక కరీనా ధరించిన ఆ డ్రెస్‌ ధర ఏకంగా రూ. 1,78,006 పలుకుతుందట. ఈ డిజైన్‌వేర్‌ని ప్రింటెడ్‌ సిల్క్‌ క్రేప్‌ డి చైన్‌ కఫ్తాన్‌ అని పిలుస్తారట. నైట్‌ టైంలో సౌకర్యవంతంగా ధరించే పైజామా అంత ఖరీదా?.. అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయినా కరీనా అంటే ఆ మాత్రం రేంజ్‌లో ధర ఉండాల్సిందే అని మరి కొందరూ కామెంట్‌లు చేస్తూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: ఐశ్వర్య అందమంతా చీరలోనే.. ధరెంతో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement