నటి ప్రియాంక చోప్రా నెక్లెస్‌ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు! | Priyanka Chopras Dazzling Vintage Necklace Is Priced At Rs 8 Crore, Check Out The Details | Sakshi
Sakshi News home page

నటి ప్రియాంక చోప్రా నెక్లెస్‌ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!

Aug 27 2024 10:17 AM | Updated on Aug 27 2024 12:18 PM

Priyanka Chopras Dazzling Vintage Necklace Is Priced

బాలీవుడ్‌ నటి, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ చిత్రసీమ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ప్రియాంక వెనుదిరిగి చూడకుండా బాలీవుడ్‌, హాలీవుడ్‌ వరుస సినిమాలతో బిజీగా ఉండే నటిగా పేరు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో వేలాదిగా అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు గ్లోబల్‌ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. 

ఇటీవల ముంబైలో తన సోదరుడు సిద్ధార్థ్‌ చోప్రా వివాహ వేడుకలలో తళుక్కుమంది. ఆ వేడుకలో ఆమె ధరించిన చీర, ఆభరణాలు హైలెట్‌గా నిలిచాయి. డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా 9 గజాల బెర్రీ-హ్యూడ్ షిఫాన్ చీరను ధరించింది. ఆ కాస్ట్యూమ్‌కి తగ్గట్టుగా  బల్గారీ బ్రాండ్‌కి చెందిన అద్భుతమైన ఆభరణాలతో మెరిశారు. ఐకానిక్ రోమన్ జువెలరీ మైసన్‌కి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక, లగ్జరీ ఇటాలియన్ ఫ్యాషన్ హౌస్‌కి చెందిన ఆభరణాలను ధరించింది. 

సర్పెంటైన్ కలెక్షన్ నుంచి డైమండ్ బ్రాస్ లెట్, వింటేజ్ ముత్యాల నెక్లెస్ ను ఎంచుకుంది. సర్పెంటీ వైపర్ బ్రేస్ లెట్‌గా పిలిచే ఈ బ్రేస్లెట్‌ మొత్తం డైమండ్స్‌తో కూడిన 18 క్యారట్ వైట్ గోల్డ్ సెట్‌లో వన్ కాయిల్ డిజైన్‌ను కలిగి ఉంది. అధికారిక బల్గారి వెబ్సైట్ ప్రకారం దీని విలువ అక్షరాలా 30,79,000/- పలుకుతుందట. అలాగే ముత్యాల నెక్లేస్ ధర అంతకు మించి అన్న రేంజ్‌లో ఉంది. హై జ్యువెలరీ పెర్ల్,  రూబీస్, వైట్ గోల్డ్ ,డైమండ్స్‌లో కూడిన ఈ నెక్లెస్‌ ధర ఏకంగా రూ. 8 కోట్లు పలుకుతుందట. ఆమె ఇలా లగ్జరీ ఆభరణాలు ధరించడం మొదటిసారి కాదు. 

ఇంతకుమునుపు బల్గారీ బ్రాండ్‌ 140వ వార్షికోత్సవంలో అత్యంత ఖరీదైన ఆభరణాలను ధరించి వార్తల్లో నిలిచింది. ఆ వేడుకలో ప్రియాంక సర్పెంట్‌ ఏటర్నా నెక్లస్‌ని ధరించింది. ఈ నెక్లస్‌ని రూపొందించడానికి ఏకంగా 2,800 గంటలు పట్టిందట. అంతేగా 140 ఏళ్ల వార్షికోత్సవానికి ప్రతీకగా 140 క్యారెట్‌లతో కూడి అత్యంత బరువున్న వజ్రం, ప్లాటినమ్‌, పియర్‌ ఆకారంలోని డైమండ్‌లతో తీడైమన్షనల్‌ వేవ్‌ స్ట్రక్చర్‌లో తీర్చిదిద్దారు కళాకారులు. 

(చదవండి: 102 ఏళ్ల బామ్మ సాహసం..ఏకంగా ఏడువేల అడుగుల ఎత్తు నుంచి..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement