Nita Ambani: కోడలికి గిఫ్ట్‌గా కోట్ల విలువైన 'ఖాందానీ హార్‌'! ప్రత్యేకత ఇదే | Nita Ambani Gifted khandani Haar To Daughter In Law Radhika Merchant | Sakshi
Sakshi News home page

కోడలికి గిఫ్ట్‌గా 'ఖందానీ హార్‌'ఇచ్చిన నీతా అంబానీ..! ప్రత్యేకత ఇదే

Jan 28 2025 10:23 AM | Updated on Jan 28 2025 12:55 PM

Nita Ambani Gifted  khandani Haar To Daughter In Law Radhika Merchant

కోట్లకు పడగలెత్తితే..ఆ కుంటుంబాల్లో ఇచ్చే బహుమతులు, కానుకలు వార్తల్లో నిలుస్తాయి. డబ్బుంటే ఆ రేంజ్‌కి తగ్గ బహుమతులతో ప్రేమను కురిపిస్తారు. బడా వ్యక్తుల మధ్య ప్రేమ కూడా అత్యంత విలాసవంతంగా ఉంటుంది. అలాంటి కోవలో మొదటి స్థానంలో నిలిచేది అంబానీల కుటుంబమే. ఇటీవల ​కాలంలో ఆ ఇంట జరిగిన విలాసవంతమైన వివాహ వేడుకలే అందుకు నిదర్శనం. గతేడాది చిన్న కుమారుడు అనంత్‌ రాధికల పెళ్లి వేడుక ఎంత విలాసవంతంగా జరిగిందో తెలిసిందే. అదీగాక చిన్న కోడలు రాధికా మర్చంట్‌కి అంబానీ కుటుంబం ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్‌లు కూడా హైలెట్‌గానే నిలిచాయి. తాజాగా నీతా అంబానీ తన అందమైన కోడలు రాధికాకు మరో అద్భుతమైన నెక్లెస్‌ని కానుకగా ఇచ్చింది. అది వారి కుటుంబ వారసత్వానికి సంబంధించిన నగ అట. మరీ ఆ నెక్లెస్‌ విశేషాలెంటో చూద్దామా..!

అంబానీలు కుటుంబ సంప్రదాయాలకు గొప్ప ప్రాముఖ్యతను ఇస్తారు. అందులో భాగంగానే తమ వారసత్వాన్ని సూచించే విలువైన వస్తువులను వారి కోడళ్లకు బహుమతులుగా ఇస్తుంటారు. అలానే చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ భార్య రాధిక మర్చంట్‌(Radhika Merchant)కి పచ్చలు, వజ్రాలతో పొదిగిన 'ఖందానీ హార్‌(khandani haar)'ని బహుమతిగా ఇచ్చారట నీతా అంబానీ(Nita Ambani )

దీని ఖరీదు రూ. 1.8 కోట్లు పైనే ఉంటుందట. ఈ నెక్లెస్‌ అంబానీల కుటుంబ వారసత్వం, భావోద్వేగాలతో ముడిపడి ఉన్న విలువైన నగ అట.  నీతా ఇంతకు మునుపు కూడా ఇలానే ముత్యాలు, వజ్రాలు పొదిగిన ఖరీదైన చోకర్‌ని బహుమతిగా ఇచ్చారు. నిజానికి కుటుంబ బంధంతో ముడిపడి ఉన్న నగలు విలువ వెలకట్టలేం. 

కాగా, నీతా ఇలా తన పెద్ద కోడలు శ్లోకా మెహతాకు కూడా అత్యంత ఖరీదైన మౌవాద్ ఎల్'ఇన్‌కంపారబుల్ నెక్‌పీస్ నగని బహుమతిగా ఇచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రాలతో డిజైన్‌ చేసిన నగ ఇది. ఇలాంటి విలాసవంతమైన బహుమతులతో అంబానీ కుటుంబ సంప్రదాయాలు, వైభవం ఒకదానికొకటి గట్టిగా ముడిపడి ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

(చదవండి: ఎవరీ విశ్వనాథ్‌ కార్తికే..? జస్ట్‌ 16 ఏళ్లకే అరుదైన ఘనత సాధించాడు!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement