
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్నకుమారుడు, కోడలు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో సందడి చేశారు. గతనెలలో(జూలై 12)న వివాహ బంధంతో ఒక్కటైన లవ్‌బర్డ్స్ వివాహ వేడుకలతరువాత విశ్వక్రీడా సంరంభం ఒలింపిక్స్ గ్యాలరీలో జంటగా మెరిసారు. అనంత్-రాధిక ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్ వేడుకల్లో ఆసియా కుబేరుడుముఖేష్ అంబానీ, ఈషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరామిల్ పాల్గొంటున్నవీడియో కూడా సందడిగామారింది.
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ అయిన నీతా ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్న ప్రాంగణంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన తొలి ఇండియా హౌజ్ లాంచ్ చేశారు. భారతీయ టెక్స్‌టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్‌కు చెందిన వస్తువులు, ఇతక కళాఖండాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంటాయి. అలాగే భారత స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్, మనుభాకర్‌ను నీతా అంబానీ ప్రత్యేకంగా అభినందించి, వారితో సెల్పీలు దిగి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment