
మెల్‌బోర్న్: టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ సహచరులతో కలిసి మెల్‌బోర్న్ పుర వీధుల్లో చక్కర్లు కొట్టాడు. వింటర్ సూట్ ధరించిన రాహుల్ అక్కడున్న బెంచీలపై కూర్చుని సేద తీరాడు. ఈ విశేషాలన్నీ ‘మెల్‌బోర్న్ ఆర్కివ్స్’ అంటూ అతను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. అభిమానులు స్పందించారు. రాహుల్ ఫ్యాషన్ సెన్స్ బాగుందంటూ కితాబిచ్చారు. బాలీవుడ్ నటి అథియా శెట్టీ కూడా రాహుల్ ఫొటోలు బాగున్నాయని చెప్తు.. హార్ట్ ఎమోజీతో కామెంట్ చేసింది. అథియా, రాహుల్ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆటవిషయానికి వస్తే.. ఐపీఎల్ 13వ సీజన్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న రాహుల్ 14 మ్యాచుల్లో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించాడు. కెప్టెన్‌గా కింగ్స్ పంజాబ్ జట్టును ముందుండి నడిచాడు.
అయితే, తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. మూడు వన్డేల్లో కలిపి 76 పరుగులు, మూడు టీ20ల్లో 81 పరుగులే చేశాడు. ఇక టెస్టు జట్టులోనూ చోటుదక్కించుకున్న రాహుల్ పింక్‌బాల్ టెస్టులో తుది జట్టులో మాత్రం బెంచ్‌కే పరిమితమయ్యాడు. కాగా, అడిలైడ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియా దారుణ ఓటమిని చవిచూసింది. తన టెస్టు చరిత్రలోనే 36 పరుగుల అత్యల్ప స్కోరు నమోదు చేసింది. రేపటి నుంచి మెల్‌బోర్న్ వేదికగా జరిగే రెండో టెస్టులో రాహుల్ మైదానంలోకి దిగే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment