Actress Athiya Shetty Slams Trolls For Claiming KL Rahul Visited Strip Club In London - Sakshi
Sakshi News home page

Athiya Shetty: సంబంధం లేని వాటిని రుద్దకండి.. నెటిజన్స్‌కు అతియా శెట్టి గట్టి కౌంటర్!

Published Sun, May 28 2023 3:52 PM | Last Updated on Sun, May 28 2023 4:13 PM

Athiya Shetty SLAMS trolls for claiming KL Rahul visited strip club in London - Sakshi

బాలీవుడ్ నటి అతియా శెట్టి, టీమిండియా క్రికెటర్ కేఎల్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఈ ఏడాది ప్రారంభంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో పెళ్లి ఘనంగా జరిగింది.  అయితే ఐపీఎల్‌లో లక్నో సూపర్ జైయింట్స్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ గాయం కారణంగా మధ్యలోనే వెదొలిగిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్‌ అవార్డులు.. నెటిజన్స్‌ ట్రోలింగ్‌)

అయితే ప్రస్తుతం ఈ జంట లండన్‌ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.  లండన్‌లోని ఓ క్లబ్‌లో కేఎల్ రాహుల్ తన స్నేహితులతో సరదాగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ కేఎల్‌పై ట్రోల్స్ చేశారు. గాయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు దూరమైనా బాధ లేకుండా.. క్లబ్‌లో ఎంజాయ్ చేస‍్తూ కనిపించడాన్ని తప్పుబడుతున్నారు. అయితే కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి దీనిపై కాస్తా గట్టిగానే ఇచ్చి పడేసింది.

 

(ఇది చదవండి: సత్తా చాటిన సమంత 'శాకుంతలం'.. ఏకంగా నాలుగు అవార్డులు!)

తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది. నేను సాధారణంగా చాలా వరకు మౌనంగానే ఉండాలనుకుంటా. కానీ కొన్నిసార్లు మన కోసం నిలబడటం చాలా ముఖ్యం. నేను, రాహుల్, మా ఫ్రెండ్స్‌తో సాధారణంగా ఓ ప్రదేశానికి వెళ్లాం. దయచేసి సంబంధం లేని విషయాలతో ముడిపెట్టకండి. అనేముందు ఒకసారి అలోచించుకోండి.' అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది అతియాశెట్టి.  తన భర్తను ట్రోల్ చేయడంపై కాస్త ఘాటుగానే స్పందించింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement