KL Rahul Residence Gets Decked Up With Lights Amid Wedding Rumours With Athiya Shetty - Sakshi
Sakshi News home page

KL Rahul- Athiya Shetty: మూడు రోజుల పెళ్లి! జిగేల్‌మంటున్న క్రికెటర్‌ నివాసం

Published Wed, Jan 18 2023 5:26 PM | Last Updated on Wed, Jan 18 2023 6:40 PM

KL Rahul Mumbai Residence Lit Up As Wedding Rumours With Athiya - Sakshi

రాహుల్‌- అతియా పెళ్లి ఏర్పాట్లు (PC: Instagram)

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు, బాలీవుడ్‌ నటి అతియా శెట్టిని వివాహమాడబోతున్నాడు. వీరి పెళ్లికి సంబంధించి ఇంతవరకు అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఇరు కుటుంబాలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


photo courtesy :KL Rahul/Instagram

న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్‌కు రాహుల్‌ దూరం కావడం సహా.. ముంబైలో ఉన్న అతడి ఇంటిని అందంగా అలంకరించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ప్లష్‌ పాలి హిల్‌లోని సంధూ ప్యాలెస్‌ లైట్లతో వెలిగిపోతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 


photo courtesy :KL Rahul/Instagram

జనవరి 23న రాహుల్‌- అతియా పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. జనవరి 21 నుంచి మూడు రోజుల పాటు వివాహ వేడుక నిర్వహించేందుకు ఇరు వర్గాల పెద్దలు నిశ్చయించారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అతియా తండ్రి, బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సునిల్‌ శెట్టి ఖండాలా ఫామ్‌హౌజ్‌లో ప్రివెడ్డింగ్‌ కార్యక్రమాలు మొదలైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అత్యంత సన్నిహితుల సమక్షంలో రాహుల్‌- అతియా పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.


photo courtesy :KL Rahul/Instagram

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement