
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ డేటింగ్‌లో ఉన్నాడంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో కలిసి పార్టీలు చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టితో కేఎల్ రాహుల్ దిగిన ఫోటోలు బయటకు రావడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సాగుతున్న పుకార్లు మళ్లీ బలంగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు బాలీవుడ్ పత్రికలు కథనాలు రాస్తున్నాయి. కేఎల్ రాహుల్‌తో అతియా శెట్టి క్లోజ్‌గా దిగిన ఫోటోలు వాటికి యాడ్ చెయ్యడంతో గాసిప్స్‌కు మరింత బలం చేకూరుతుంది.
ఈ నేపథ్యంలో రాహుల్, అతియా కొత్త ఏడాది సంబరాలకు స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్ బీచ్‌కు వెళ్లినట్లు సోషల్ మీడియా కోడైకూస్తోంది. దీనికి సంబంధించిన పలు ఫోటోలు సైతం చక్కర్లుకొడుతున్నాయి. దీంతో వారిద్దరి మధ్య నిజంగానే ప్రేమ వ్యవహారం నడుస్తోందని నెడిజన్లు అభిప్రాయపడుతున్నారు. క్రికెటర్లు, సినిమా స్టార్లు లవ్‌లో పడటం కామన్ అని వారి ప్రేమన కన్ఫామ్ చేస్తున్నారు. అతియా శెట్టి 2015లో సూరజ్ పాంచోలి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమాతో కథానాయికగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రాహుల్‌పై డేటింగ్ వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలువురు ముద్దుగుమ్మలతో మనోడు చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు వార్తలు బలంగానే వినిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment