బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయ అతియా శెట్టి- టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో ప్రేమలో ఉందంటూ బీ-టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అతియా బెస్టీ, మోడల్, సోషల్ మీడియా ఫేమ్ ఆకాంక్ష రంజన్‌కపూర్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోనే ఇందుకు కారణం. రాహుల్, అతియాలతో కలిసి తీసుకున్నట్లుగా ఫొటోను షేర్ చేసిన ఆకాంక్ష.. ‘ఆ ప్రేమతో నేనెంతో సంతోషంగా ఉన్నాను’ అంటూ క్యాప్షన్ జత చేసింది. దీంతో అతియా, రాహుల్ ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్‌లో ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో అతియా, రాహుల్‌ల మధ్య గత ఫిబ్రవరిలో స్నేహం చిగురించిందని.. అప్పటి నుంచి వీరిద్దరు కలిసి బయటకు వెళ్తున్నారని అతియా సన్నిహితులు తెలిపారు. అంతేకాకుండా ఈ రిలేషన్‌షిప్ పట్ల ఇద్దరు చాలా సీరియస్‌గా ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ బాలీవుడ్ సైట్ కథనం ప్రచురించింది. అయితే ఈ విషయంపై వీరిద్దరి నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
కాగా రాహుల్ ప్రస్తుతం ప్రపంచకప్‌తో బిజీగా ఉండగా.. అతియా తన అప్‌కమింగ్ మూవీ మెతీచూర్ చక్నాచూర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 2015లో ‘హీరో’ సినిమాతో తెరంగేట్రం చేసిన అతియా ప్రస్తుతం హీరోయిన్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హీరోయిన్లతో కలిసి రాహుల్ పేరు వినిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్, ఆకాంక్ష రంజన్‌తో రాహుల్ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీరంతా ఈ విషయాన్ని ఖండించారు. అయినా కలిసి ఫొటో దిగినంత మాత్రాన రాహుల్‌పై అసత్యాలు ప్రచారం చేస్తారా అంటూ అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ను ప్రశాంతంగా ఆడుకోవినవ్వండి అంటూ మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment