న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టితో డేటింగ్‌లో ఉన్నాడని చాలాకాలంగా రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రూమర్స్‌పై వీరిద్దరు ఎప్పుడూ స్పందించలేదు. కానీ తాజాగా వీరిద్దరు 'డిన్నర్ డేట్' కోసం వెళ్లి మీడియా కెమెరాలకు చిక్కారు. దీంతో ఈ ఇద్దరి ప్రేమాయణం నిజమేనన్న చర్చ జరుగుతోంది. ముంబైలోని ఓ ప్రముఖ హోటల్లో డిన్నర్ చేసేందుకు వెళ్లిన అతియా,రాహుల్.. హోటల్ నుంచి బయటకు వస్తుండగా కెమెరాలకు చిక్కారు. అయితే వీరితో పాటు అథియా స్నేహితురాలు ఆకాంక్ష, బాలీవుడ్ నటుడు పంచోలీ కూడా ఉన్నారు. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్ నిర్మాత విక్రమ్ ఫడ్నీస్ గతంలో అథియా శెట్టీ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. అప్పటినుంచి ఈ జంట ప్రేమాయణం వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి.
అయితే అతియా గానీ,రాహుల్ గానీ ఇప్పటివరకు తమ మధ్య అలాంటిదేమీ లేదని చెప్పలేదు. దీంతో ఇద్దరి మధ్య 'సమ్‌థింగ్ సమ్‌థింగ్' అన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవల భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన రాహుల్.. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే దొరికిన విరామ సమయాన్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు రాహుల్. గతంలో అతియా-రాహుల్‌ల మధ్య ప్రేమాయణం నడుస్తుందనే వార్తలు వచ్చాయి. తాజాగా దీనికి మరింత బలాన్ని చేకూరుస్తూ వీరిద్దరూ మరోసారి కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక హీరోయిన్లతో కలిసి రాహుల్ పేరు వినిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్, ఆకాంక్ష రంజన్‌తో రాహుల్ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి.
రాహుల్-అతియాల డేటింగ్ నిజమేనా?
Published Mon, Oct 7 2019 11:00 AM | Last Updated on Mon, Oct 7 2019 11:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment