KL Rahul Athiya Shetty: KL Rahul Adorable Wish For Rumoured Girlfriend Athiya Shetty - Sakshi
Sakshi News home page

KL Rahul- Athiya Shetty: హ్యాపీ బర్త్‌డే మై లవ్‌.. కన్‌ఫామ్‌ చేసేశాడు.. శుభాకాంక్షలు వదినా..

Published Sat, Nov 6 2021 2:34 PM | Last Updated on Sat, Nov 6 2021 3:44 PM

KL Rahul Adorable Wish For Rumoured Girlfriend Athiya Shetty Goes Viral - Sakshi

KL Rahul Adorable Wish For Rumoured Girlfriend Athiya Shetty Goes Viral: టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌- బాలీవుడ్‌ నటి అతియా శెట్టి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపిస్తూ వీటికి మరింత బలం చేకూరుస్తున్నారు వీరు. ఇక నవంబరు 5న అతియా శెట్టి పుట్టిన రోజు సందర్భంగా కేఎల్‌ రాహుల్‌ చేసిన పోస్టు చూసిన నెటిజన్లు.. ‘‘రాహుల్‌ కన్‌ఫామ్‌ చేసేశాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అతియాతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసిన రాహుల్‌.. ‘‘హ్యాపీ బర్త్‌డే మై లవ్‌’’అంటూ క్యాప్షన్‌ జతచేశాడు. ఇక ఇందుకు స్పందించిన సెలబ్రిటీలు అనుష్క శర్మ, హార్దిక్‌ పాండ్యా, టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సతీమణి రితికా సజ్దే, పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా భార్య, ప్రజెంటర్‌ సంజనా గణేషన్‌ హార్ట్‌ సింబల్‌తో వీరికి విషెస్‌ తెలిపారు. ఇక ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ, రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పంజాగ్‌ కింగ్స్‌ ఆటగాడు మన్‌దీప్‌ సింగ్‌.. పుట్టినరోజు శుభాకాంక్షలు వదినా అంటూ కామెంట్‌ చేయడం విశేషం. 

అదే విధంగా అతియా తండ్రి, బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సునిల్‌ శెట్టి సైతం రాహుల్‌ పోస్టుపై హర్షం వ్యక్తం చేశాడు. దీంతో వీరి పెళ్లికి పెద్దల అంగీకారం లభించిందని.. త్వరలోనే వైవాహిక బంధంలో అడుగుపెట్టబోతున్నారంటూ మరోసారి కథనాలు మొదలయ్యాయి. రాహుల్‌ పోస్టు ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇక ప్రేయసి బర్త్‌డే రోజున స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో చెలరేగిన రాహుల్‌.. టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేసి తన కెరీర్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. తద్వారా యువరాజ్‌ సింగ్‌ సరసన నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

చదవండి: T20 WC: అదొక్కటే దారి.. అలా అయితే భారత్‌ సెమీస్‌ చేరడం ఖాయం.. మరి అఫ్గన్‌ గెలిచినా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement