భార్య అతియా శెట్టితో కేఎల్ రాహుల్
KL Rahul Posts An Adorable Pic With His Wife Athiya Shetty: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. గాయం కారణంగా నెలల తరబడి జట్టు దూరమైన ఈ కర్ణాటక ప్లేయర్.. ఆసియా కప్-2023తో ఘనంగా పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. అయితే, పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించకపోవడంతో మెగా ఈవెంట్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
ఈ క్రమంలో పాకిస్తాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ స్థానంలో జట్టులోకి వచ్చిన రాహుల్.. అజేయ సెంచరీ(111)తో సత్తా చాటాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు.
బ్యాట్‌తోనే కాదు వికెట్ కీపింగ్ నైపుణ్యాలతోనూ ఆకట్టుకుని.. వన్డే వరల్డ్‌కప్-2023కి తాను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు చాటిచెప్పాడు ఈ మిడిలార్డర్ బ్యాటర్. ఈ క్రమంలో ఐసీసీ టోర్నీ కంటే ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఏకంగా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
సారథి రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గైర్హాజరీ నేపథ్యంలో తొలి రెండు మ్యాచ్‌లకు రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. సెప్టెంబరు 22న ఈ సిరీస్ మొదలు కానుండగా.. ఈ మధ్యలో దొరికిన కాస్త విరామ సమయాన్ని కుటుంబానికి కేటాయించాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.
భార్య అతియా శెట్టితో కలిసి.. భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట గణపతి పూజలో పాల్గొన్నాడు. వైట్‌కుర్తా.. పైజామా ధరించి రాహుల్ హుందాగా కనిపించగా.. ఎరుపు రంగు చీరలో సంప్రదాయకట్టులో అతియా మెరిసిపోయింది. ఈ క్రమంలో రాహుల్- అతియా తమ అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
హార్ట్ ఎమోజీతో ఇన్‌స్టాలో ఇద్దరూ బుధవారం ఫొటోలను షేర్ చేయగా... నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక పూజలో పాల్గొనేందుకు వెళ్లిన ఈ దంపతుల వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా బాలీవుడ్ సీనియర్ నటుడు సునిల్ శెట్టి కుమార్తె, నటి అతియాతో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కేఎల్ రాహుల్.. ఈ ఏడాది జనవరిలో ఆమెతో కలిసి ఏడడుగులు నడిచిన విషయం తెలిసిందే.
చదవండి: ఆసియా కప్ ఫైనల్‌లో ఘోర ఓటమి.. శ్రీలంక కెప్టెన్‌పై వేటు! కొత్త కెప్టెన్ ఎవరంటే?
#WATCH | Indian Cricketer KL Rahul with his wife Athiya Shetty arrive at Mukesh Ambani's residence 'Antilia' in Mumbai to attend Ganesh Chaturthi celebrations #GaneshChaturthi2023 pic.twitter.com/P2t3GXmSCG
— ANI (@ANI) September 19, 2023
Comments
Please login to add a commentAdd a comment