![KL Rahul And Athiya Shetty Getting Married Soon - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/20/444444_0.jpg.webp?itok=StYwFRKM)
KL Rahul And Athiya Shetty Getting Married Soon: మొన్నటిదాకా బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్-అలియా భట్ పెళ్లి ముచ్చట బీటౌన్‌లో జోరుగా సాగింది. ఎట్టకేలకు ఏప్రిల్ 14న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా మరో జంట పెళ్లికి భాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కుమార్తె, హీరోయిన్ అతియా శెట్టి, టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారని సమాచారం. చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట ఈ ఏడాది శీతకాలం సీజన్‌లో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వెబ్‌సైట్ కథనం ప్రకారం వారు దక్షిణ భారత వివాహ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
'ఇప్పటికే ఈ పెళ్లికి సన్నహాలు ప్రారంభమయ్యాయి. అతియా శెట్టి, కేఎల్ రాహుల్ వివాహం వారి ఇరువురి పేరెంట్స్‌కు ఎంతో ఇష్టం. 2022 ఏడాది పూర్తయ్యేలోపు వారు పెళ్లి చేసుకోవచ్చు.' అని శెట్టి కుటుంబ సన్నిహితులు చెప్పినట్లు ఆ వెబ్‌సైట్ వెలువరించింది. సౌత్ ఇండియాకు చెందిన సునీల్ శెట్టి ముల్కిలోని మంగళూరుకు చెందిన తుళు మాట్లాడే కుటుంబంలో జన్మించాడు. కేఎల్ రాహుల్ కూడా మంగళూరుకు చెందినవాడే. అందుకే అతియా శెట్టి, కేఎల్ రాహుల్ వివాహాన్ని సౌత్ ఇండియన్ వెడ్డింగ్ స్టైల్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం.
చదవండి: హ్యాపీ బర్త్‌డే మై లవ్.. శుభాకాంక్షలు వదినా.. వైరల్
చదవండి: అంకుల్ ఓకే అన్న తర్వాత ఇంకేంటి రాహుల్.. వెళ్లు అక్కడ నిలబడు!
Comments
Please login to add a commentAdd a comment