Buzz: Athiya Shetty And KL Rahul Move Into A Rented Apartment In Mumbai After Marriage - Sakshi
Sakshi News home page

Athiya Shetty And KL Rahul: అపార్ట్‌మెంట్‌లోకి అతియా శెట్టి- కేఎల్ రాహుల్‌.. అద్దె లక్షల్లోనే!

Published Fri, Apr 22 2022 1:00 PM | Last Updated on Fri, Apr 22 2022 1:27 PM

Athiya Shetty And KL Rahul Move Into A Rented Apartment In Mumbai - Sakshi

Athiya Shetty And KL Rahul Move Into A Rented Apartment In Mumbai: ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ హీరో సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి, క్రికెటర్‌ కెఎల్‌ రాహుల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట త్వరలో వివాహబంధంతో ఒక్కటి కానున్నారని బాలీవుడ్‌లో టాక్. ఈ జంట ఈ ఏడాది శీతాకాలంలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ లవ్‌ బర్డ్స్‌ దక్షిణ భారత వివాహ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ జంట గురించి తాజాగా ఓ కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. 

అతియా శెట్టి, రాహుల్‌ తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలనుకుంటున్నారట. పింక్‌విల్లా కథనం ప్రకారం ఈ జంట ముంబైలోని సుమద్రం పక్కన, బాంద్రా కార్టర్‌ రోడ్‌లో 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారని సమాచారం. ఈ అపార్ట్‌మెంట్‌ అద్దె నెలకు రూ. 10 లక్షలు అని తెలుస్తోంది. పెళ్లి తర్వాత వారు అక్కడే స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. కాగా ఈ జంట వారి ప్రేమను తెలియజేసేందుకు సోషల్‌ మీడియాలో ఏమాత్రం వెనుకాడరు. ఇదివరకు కెఎల్‌ రాహుల్‌ బర్త్‌డే సందర్భంగా 'ఎక్కడైనా నీతోనే.. హ్యాపీ బర్త్‌డే' అని పోస్ట్ షేర్‌ చేసింది అతియా శెట్టి. 

చదవండి: త్వరలో పెళ్లి చేసుకోనున్న కేఎల్‌ రాహుల్-అతియా శెట్టి !


చదవండి: క్యాన్సర్‌తో బాధపడుతున్న బుల్లితెర నటి.. ఎమోషనల్‌గా పోస్ట్‌


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement