KL Rahul And Athiya Shetty Will Get Married In Next Three Months, Says Reports - Sakshi
Sakshi News home page

KL Rahul-Athiya Shetty Marriage: కేఎల్‌ రాహుల్‌-అతియా శెట్టిల వివాహం ఎప్పుడంటే..?

Published Tue, Jul 12 2022 11:44 AM | Last Updated on Tue, Jul 12 2022 12:26 PM

KL Rahul And Athiya Shetty To Tie Knot In Next Three Months Says Reports - Sakshi

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలుస్తోంది. గత కొంతకాలంగా బాలీవుడ్‌ నటి అతియా శెట్టితో డేటింగ్‌లో ఉన్న రాహుల్‌.. మరో మూడు నెలల్లో పెళ్లి పీఠలెక్కబోతున్నాడని సమాచారం. పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకునేందుకు రాహుల్‌ తల్లిదండ్రులు ఇటీవలే అతియా తండ్రి సునీల్‌ శెట్టిని కలిశారని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఈ రెండు కుటుంబాలు కలిసి రాహుల్‌-అతియా జంట పెళ్లి తర్వాత ఉండబోయే కొత్త ఇంటిని (ముంబై) సందర్శంచారని, అక్కడే పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేయాలని వారు నిర్ణయించారని అతియా సన్నిహితులు తెలిపారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ అతియానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. 

కాగా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు గాయం బారిన పడిన కన్నూర్‌ లోకేశ్‌ రాహుల్ ప్రస్తుతం భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న  సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాహుల్‌ చికిత్స కోసం జర్మనీలో ఉండగా.. ప్రేయసి అతియా కూడా అతనితోనే ఉంది. రాహుల్‌ గాయం నుంచి కోలుకునేందుకు మరో నెల రోజులు పడుతుందని, అప్పటి వరకు అతియా కూడా రాహుల్‌తోనే ఉంటుందని సమాచారం. అతియా సోదరుడు అహాన్ శెట్టి అరంగేట్ర సినిమా 'తడప్' ప్రీమియర్ సందర్భంగా రాహుల్-అతియాలు తొలిసారి తమ ప్రేమ వ్యవహారాన్ని బహిరంగ పరిచారు. టీమిండియా తదుపరి కెప్టెన్‌ రేసులో ఉన్న రాహుల్‌.. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు సునీల్‌ శెట్టి గారాలపట్టి అతియా బాలీవుడ్‌ సినిమాల్లో బిజీగా ఉంది. 
చదవండి: ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న బట్లర్‌.. మరో సిరీస్‌ లక్ష్యంగా హిట్‌మ్యాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement