
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ జంట ఈ ఏడాది ఒక్కటవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు హల్‌చల్ చేశాయి. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. న్యూ ఇయర్ సందర్భంగా దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ విషయాన్ని కేఎల్ రాహుల్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
(ఇది చదవండి: అతియా శెట్టి- కేఎల్ రాహుల్ వెడ్డింగ్.. డేట్ ఫిక్స్..!)
ఈ విషయాన్ని అతియా తన ఇన్‌స్టాలో స్టోరీలోనూ పోస్ట్ చేసింది. ఫ్రెండ్స్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది భామ. కాగా.. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన సూరజ్ పంచోలీతో కలిసి 2015లో రొమాంటిక్ యాక్షన్ చిత్రం ‘హీరో’ సినిమాతో అతియా శెట్టి ఎంట్రీ ఇచ్చింది. ఆమె చివరి సారిగా ‘మోతీచూర్ చక్నాచూర్’ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఫుట్‌బాల్ క్రీడాకారుడు అఫ్షాన్ ఆషిక్ బయోపిక్ ‘హోప్ సోలో’లో ఆమె ప్రధాన పాత్రలో నటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment