‘కర్ణాటక అల్లుడు’గానే టీమిండియా వైస్‌ కెప్టెన్‌! డేట్‌ ఫిక్స్‌.. సెలవు మంజూరు | KL Rahul All Set To Tie Knot With Athiya BCCI Approves His Leave | Sakshi
Sakshi News home page

KL Rahul: టీమిండియా వైస్‌ కెప్టెన్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్‌! సెలవు మంజూరు చేసిన బీసీసీఐ!

Published Fri, Dec 2 2022 11:48 AM | Last Updated on Sat, Dec 3 2022 4:43 PM

KL Rahul All Set To Tie Knot With Athiya BCCI Approves His Leave - Sakshi

కేఎల్‌ రాహుల్‌- అతియా శెట్టి(PC: Athiya Shetty Instagram)

KL Rahul-  Athiya Shetty Marriage: టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ వచ్చే ఏడాది ఆరంభంలో పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలుస్తోంది. కాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సునిల్‌ శెట్టి కుమార్తె, నటి అతియా శెట్టితో రాహుల్‌ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని సునిల్‌ ధ్రువీకరించడం సహా పిల్లల నిర్ణయానికి అనుగుణంగానే వారు కోరుకున్నపుడు పెళ్లి చేస్తామని గతంలో మీడియాతో పేర్కొన్నాడు. అయితే, భారత క్రికెట్‌ జట్టులో కీలక సభ్యుడైన రాహుల్‌ బిజీ షెడ్యూల్‌ కారణంగా కొన్నాళ్లు పెళ్లిని వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి.

ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌.. ఈ టూర్‌ ముగియగానే వివాహం చేసుకునేందుకు డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నాడట. ఈ నేపథ్యంలో లీవ్‌ కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి దరఖాస్తు చేసుకోగా.. సెలవు మంజూరైనట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల జనవరిలో తనకు లీవ్‌ కావాలన్న రాహుల్‌.. అదే నెలలో అతియాతో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. 

‘కర్ణాటక అల్లుడి’గా రాహుల్‌
సునిల్‌ శెట్టి కర్ణాటక ప్రాంతానికి చెందిన వాడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబైలో సెటిల్‌ అయిన ఈ వెటరన్‌ యాక్టర్‌.. తన స్వస్థలానికి చెందిన కేఎల్‌ రాహుల్‌ను అల్లుడిగా చేసుకోనుండటం విశేషం. కాగా బెంగళూరులో జన్మించిన రాహుల్‌ దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి: IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. కనీసం 2 కోట్లు కూడా!
Pak Vs Eng: పాక్‌కు దిమ్మతిరిగేలా ఇంగ్లండ్‌ ప్రపంచ రికార్డు! టీమిండియాను వెనక్కినెట్టి..
IND vs BAN: బంగ్లాదేశ్‌ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. ఫోటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement