
సాక్షి, ముంబై : ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్లను గుర్తుపట్టగలరా. ఒకరు బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి అని చెప్పవచ్చు. మరో నటి ఎవరబ్బా అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఆమె మరెవరో కాదు సన్న నడుము సుందరి ఇలియానానే. నమ్మలేనట్లుగా ఉందంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. నిన్న (నవంబర్ 1న) ఇలియానా పుట్టినరోజు సందర్భంగా అతియా ఈ ఫొటోను షేర్ చేస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. వీరి రిలేషన్ ఏంటంటారా.. వీరిద్దరూ బాలీవుడ్ మువీ ముబారకన్‌లో కలిసి నటించిన విషయం తెలిసిందే.
గోవా సుందరి ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. కొన్ని రోజుల కిందట ఆమె మరీ సన్నగా, పాలిపోయినట్లుగా ఉన్న ఫొటోలు ఆమె అభిమానులను బాధించాయి. సన్న నడుము సుందరికి ఏమైంది అని ఆరాతీయడం మొదలుపెట్టారు. అయితే ఆమె ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇల్లీ బేబీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.
Comments
Please login to add a commentAdd a comment