బాలీవుడ్ భామ అతియా శెట్టి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో చూసి నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. ఇటీవల అతియా థాయ్‌లాండ్ టూర్‌కు వెళ్లిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేశారు. ‘‘కలగా ఉంది’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫొటోలో అతియా రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉన్న ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను క్రాప్ చేశారు. ‘ఎందుకు రాహుల్‌ను ఫొటో నుంచి తీసేశారు’ ‘రాహుల్‌ను దూరం పెట్టారా’ ‘వీరిద్దరూ కటిఫ్ చెప్పేసుకున్నారా?’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (గర్ల్‌ఫ్రెండ్ విషెస్‌కు రిప్లై ఇవ్వని రాహుల్)
కాగా అతియా, రాహుల్‌లు ఇటీవల థాయ్‌లాండ్ టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఈ జంట సందడి చేస్తున్న ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అదే ఫొటోను ఈ భామ మళ్లీ షేర్ చేస్తూ.. రాహుల్‌ను క్రాప్ చేసింది. దీంతో నెటిజన్లు పక్కనే రాహుల్ ఉన్నాడన్న విషయాన్ని పట్టేశారు. కాగా రాహుల్, అతియాలు ప్రేమించికుంటున్నట్లు బి-టౌన్ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరూ కలిసి కాఫీ షాపులకు, పార్టీలకు చేట్టాపట్టేలుసుకు తిరుగుతుండంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ గతేడాది వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎప్పడూ ఈ జంట మాట్లాడకపోవడం గమనార్హం. అయితే ఇటీవల ఈ జంట తమ బర్త్‌డే విషెష్‌లను సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చెప్పుకోవడం చూసి అభిమానుల, నెటిజన్లు వీరి రిలేషన్‌ను అధికారింగా ప్రకటించేశారంటూ అభిప్రాయ పడ్డారు. (చొక్కా ఎక్స్‌చేంజ్ చేసుకున్నారా?)
Comments
Please login to add a commentAdd a comment