'నాన్న పాట రీమేక్ లో స్టెప్పులేస్తా' | Acting with dad will be weird, says Athiya Shetty | Sakshi
Sakshi News home page

'నాన్న పాట రీమేక్ లో స్టెప్పులేస్తా'

Published Sun, Sep 20 2015 6:07 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'నాన్న పాట రీమేక్ లో స్టెప్పులేస్తా' - Sakshi

'నాన్న పాట రీమేక్ లో స్టెప్పులేస్తా'

న్యూఢిల్లీ : నాన్నతో కలిసి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అనే విషయం చాలా అద్భుతమని బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి చెప్పింది. ఇటీవలే విడుదలైన 'హీరో' మూవీతో ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే, సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి అన్న విషయం అందరికి తెలిసిందే. నాన్నతో కలిసి షూటింగ్ అంటే చాలా భయపడిపోయాను అని చెప్పింది.

రీమేక్ లో డాన్స్ చేసే అవకాశం వస్తే మాత్రం నాన్న నటించిన మూవీల్లోని ఓ ఫేమస్ సాంగ్ 'షెహర్ కి లడ్కి'లో స్టెప్పులెయడమంటే తనకు చాలా ఇష్టమన్నది. హీరో మూవీ కూడా 1983లో సుభాష్ గాయ్ తీసిన 'హీరో' మూవీకి రీమేక్. కాంపిటీషన్ అనేది మనల్ని మనం నిరూపించుకునేందుకు ఉపయోగపడుతుందన్నది.

నేను బాత్రూమ్ సింగర్ ని..
'నేను మాత్రం ఇప్పటివరకూ బాత్రూమ్ సింగర్ ని మాత్రమే అంటూ నవ్వేసింది. ఎవరైనా సంప్రదిస్తే కచ్చితంగా మూవీలో సాంగ్ పాడతాను. మూవీలో పాట పాడటం అంటే నాకు చాలా ఇష్టం' అని 'హీరో' ఫేమ్ అతియా శెట్టి చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement