హీరో రివ్యూ | Bollywood Movie Hero Review | Sakshi

హీరో రివ్యూ

Published Fri, Sep 11 2015 1:14 PM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

హీరో రివ్యూ

హీరో రివ్యూ

టైటిల్ ; హీరో
జానర్ ; రొమాంటిక్ లవ్ స్టోరీ
తారాగణం ; సూరజ్ పంచోలి, అథియా శెట్టి, ఆదిత్య పంచోలి
దర్శకత్వం ; నిఖిల్ అద్వాని
నిర్మాత ; సల్మాన్ ఖాన్, సుభాష్ ఘాయ్
నిడివి ; 132 నిమిషాలు


సుభాయ్ ఘాయ్ దర్శకత్వంలో 1983లో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమా 'హీరో'కు రీమేక్ గా అదే పేరుతో నిఖిల్ అద్వాని దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్ కథలో ఎలాంటి మార్పులు చేయకపోయిన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా స్క్రీన్ప్లేలో కొద్ది పాటి మార్పులతో ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా బజరంగీ భాయ్జాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్లో సుభాష్ ఘాయ్తో కలిసి ఈ సినిమాను తెరకెక్కించడం, స్టార్ వారసులు సూరజ్ పంచోలి, అథియా శెట్టిలను తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించటంతో రిలీజ్కు ముందు నుంచే 'హీరో' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంత వరకు అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ ;
80లలో సంచలన విజయం సాధించిన సినిమాకు రీమేక్ కావడంతో 'హీరో' కథా కథనాలపై అభిమానుల్లో పెద్దగా అంచనాలు లేవు. ముంబై సిటిలో గ్యాంగ్స్టర్ గా ఉన్న సూరజ్ ( సూరజ్ పంచోలి ), సిటీ పోలీస్ చీఫ్ మథుర్ కూతురు రాధ ( అథియా శెట్టి )ను ట్రాప్ చేసి కిడ్నాప్ చేస్తాడు. కాశ్మీర్ తీసుకెళ్లి ఆమెను బంధించి ఉంచుతాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది. ఆ తరువాత పరిస్థితులేంటి, గ్యాంగ్ స్టర్ అయిన సూరజ్, రాధ ప్రేమను ఎలా సాధించుకున్నాడు. అందుకోసం ఎలాంటి సాహసాలు చేశాడు, వీరి ప్రేమ కథకు ఎవరెవరు అడ్డువస్తారు, అన్నదే సినిమా కథ.

విశ్లేషణ ;
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓ లాంచింగ్ హీరో ఇలాంటి సినిమా చేయటం అన్నది రిస్క్ అనే చెప్పాలి. మాస్టర్ పీస్ లాంటి సినిమాలు రీమేక్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి 'హీరో' మేకింగ్ లో కనిపించలేదు. ప్రారంభంలో అద్భుతంగా అనిపించినా, సినిమా ముంగిపుకు వచ్చేసరికి బోర్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా కథా కథనాల్లో చేసిన మార్పులు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కథ మీద కన్నా హీరో హీరోయిన్లను ప్రజెంట్ చేయటం మీదే ఎక్కువగా దృష్టి పెట్టిన మేకర్స్ ఆ విషయంలో మాత్రం పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఇక మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించటం, క్వాలిటీ పరంగా కూడా 'హీరో' చాలా బాగా వచ్చింది.

నటన ;
తొలి సినిమానే అయినా సూరజ్ మంచి ఈజ్ కనబరిచాడు. అయితే నటన మీద కన్నా తన బాడీని చూపించటం మీదే ఎక్కువగా దృష్టి పెట్టిన ఈ యంగ్ హీరో చాలా సన్నివేశాలు సల్మాన్ ఖాన్ ను అనుకరించినట్టుగా అనిపించింది. ఇక అథియా శెట్టి ఒకటి రెండు సన్నివేశాల్లో ఆకట్టుకున్న ఆమె పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేకపోవటంతో నిరాశపరిచింది. గ్లామర్ పరంగా కూడా అథియా ఫెయిలయ్యిందనే చెప్పాలి.

సాంకేతిక నిపుణులు
డైరెక్షన్ పరంగా కూడా హీరో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 1983 నాటి ఫార్ములా సినిమాను అదే విధంగా ఇప్పటి ప్రేక్షకులకు అందించిన దర్శకుడు మినిమమ్ మార్కులు కూడా సాధించలేకపోయాడు. హీరోను పవర్ ఫుల్ గా చూపించాలన్న ఆలోచనతో కథను పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది. సంగీతం కూడా పెద్దగా అలరించలేకపోయింది. సల్మాన్ పాడిన ఒక్క మెలోడి తప్ప గుర్తుంచుకునే స్థాయిలో మరే పాట లేదు. యాక్షన్ సీన్స్ లో నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. సిక్స్ ప్యాక్ బాడీతో సూరజ్ చేసిన యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ ను అలరిస్తాయి.

ప్లస్ పాయింట్స్ ;

యాక్షన్ సీన్స్
క్వాలిటీ మేకింగ్

మైనస్ పాయింట్స్;

పాత కథ
పూర్ టేకింగ్
మ్యూజిక్

ఓవరాల్గా హీరో సూరజ్ పంచోలి, అతియా శెట్టిల రాంగ్ చాయిస్. ఆడియన్స్కు బోరింగ్ యాక్షన్ డ్రామా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement