Virat Kohli, Hardik Pandya And Suresh Raina Lead As Cricket Fraternity Extends Warm Wishes To KL Rahul And Athiya Shetty - Sakshi
Sakshi News home page

KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్‌! రిసెప్షన్‌ ఎప్పుడంటే..

Published Tue, Jan 24 2023 9:04 AM | Last Updated on Tue, Jan 24 2023 10:10 AM

Kohli Suryakumar Cricket Fraternity Wishes KL Rahul Athiya Shetty Wedding - Sakshi

KL Rahul and Athiya Shetty Wedding: కొత్త జంట కేఎల్‌ రాహుల్‌- అతియా శెట్టికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్‌ సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు సోషల్‌ మీడియా వేదికగా వీరికి ఆశీర్వాదాలు అందిస్తున్నారు. టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి, టీ20 స్టార్‌ సూర్యకుమర్‌ యాదవ్‌, భారత వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా సహా సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌, మునాఫ్‌ పటేల్‌ తదితరులు రాహుల్‌- అతియాలను విష్‌ చేశారు.

‘‘కొత్త జీవితానికి ఆరంభించబోతున్న మీకు శుభాకాంక్షలు..  జీవితాంతం ఇద్దరూ ఇలాగే కలిసి ఉండాలి’’ అని ఆకాంక్షించారు. ఇక సూర్య అయితే.. ‘‘చూడచక్కని జంట.. జీవిత భాగస్వాములుగా మీ ప్రయాణానికి ఆల్‌ ది బెస్ట్‌.. మీకు ఎవరి దిష్టి తగలకూడదు’’ అని రాహుల్‌- అతియా ఫొటోను షేర్‌ చేశాడు.

కాగా భారత స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ నటి అతియా శెట్టిని సోమవారం రాహుల్‌ పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలో ముంబైలో అతియా శెట్టి తండ్రి, బాలీ వుడ్‌ నటుడు సునీల్‌ శెట్టికి చెందిన ఫామ్‌హౌస్‌లో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. 

కివీస్‌తో సిరీస్‌కు దూరం
ఇక 30 ఏళ్ల అతియా 2015లో ‘హీరో’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అనంతరం ‘ముబాకరాన్‌’ ... ‘నవాబ్‌జాదే’... ‘మోతీచూర్‌ చక్నాచూర్‌’ సినిమాల్లో నటించింది. ఇక 30 ఏళ్ల రాహుల్‌ ప్రస్తుతం భారత టెస్టు జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌కు రాహుల్‌ దూరంగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2023 సీజన్‌ ముగిసిన తర్వాతే రాహుల్‌- అతియా శెట్టి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ పార్టీ ఇవ్వనున్నట్లు సునిల్‌ శెట్టి మీడియాకు తెలిపాడు. కాగా ఐపీఎల్‌లో రాహుల్‌​ లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా నూతన జంట తమ పెళ్లి ఫొటోలు షేర్‌ చేయగా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

చదవండి: Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్‌ డబుల్‌ సెంచరీ.. ఇప్పుడు ‍కింగ్‌?
షాహిద్‌ అఫ్రిదికి షాకిచ్చిన పీసీబీ.. చీఫ్‌ సెలెక్టర్‌ బాధ్యతల నుంచి తొలగింపు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement