wedding photos viral
-
హార్దిక్ పాండ్యా- నటాషా : ముచ్చటగా మూడోసారి పెళ్లి (ఫొటోలు)
-
భార్య నుదుటిన సింధూరం దిద్దిన హార్దిక్.. ముచ్చటగా మూడోసారి! పెళ్లి ఫొటోలు వైరల్
Hardik Pandya- Natasa Stankovic Hindu Wedding New Images: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ దంపతులు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. మూడేళ్ల క్రితం అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్న ఈ ప్రేమజంట.. ఈ వాలంటైన్స్ డేన రెండోసారి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ కోటలో హార్దిక్- నటాషా పెళ్లి కన్నులపండువగా జరిగింది. తమ కుమారుడు అగస్త్యతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరు మరోసారి పెళ్లి చేసుకున్నారు. తొలుత భార్య విశ్వాసాలకు అనుగుణంగా ‘వైట్ థీమ్ వెడ్డింగ్’ ఏర్పాటు చేసిన హార్దిక్ పాండ్యా.. తర్వాత హిందూ సంప్రదాయ పద్ధతిలోనూ ఆమెను వివాహమాడాడు. క్రిస్టియన్ వివాహ పద్ధతిలో నటాషా పొడవాటి అందమైన తెల్లటి గౌన్ ధరించగా.. రెండో పద్ధతిలో బంగారు- ఎరుపు వర్ణాలు కలగలసిన లెహాంగాలో మెరిసిపోయింది. ఇక పెళ్లికి ఎరుపు రంగు చీరకట్టుకుని అందమైన ఆభరణాలు ధరించి అచ్చమైన భారతీయ వనితలా కనిపించింది. PC: Hardik Pandya Instagram తొలుత ఉంగరాలు మార్చుకుని మరోసారి పెళ్లి ప్రమాణాలు చదివిన ఈ జంట.. తర్వాత అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు నడిచి ముచ్చటగా మూడోసారి పెళ్లాడారు. హార్దిక్ పాండ్యా తన భార్య నుదుటిన సింధూరం దిద్ది మురిసిపోయాడు. PC: Hardik Pandya Instagram ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు హార్దిక్- నటాషా దంపతులు. ‘‘ఇప్పుడు.. ఎల్లప్పుడూ’’ అంటూ హార్ట్ సింబల్ ఎమోజీతో తమ ప్రేమబంధం శాశ్వతం అంటూ క్యాప్షన్ జతచేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. PC: Hardik Pandya Instagram (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కాగా గుజరాత్‌కు చెందిన క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు.. సెర్బియా మోడల్, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిక్‌తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో 2020లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. నటాషా గర్భం దాల్చిన తర్వాత అదే ఏడాది పెళ్లి చేసుకున్నారు. PC: Hardik Pandya Instagram వీరికి కుమారుడు అగస్త్య జన్మించాడు. ప్రస్తుతం టీమిండియా టీ20 తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా.. త్వరలోనే పూర్తిస్థాయిలో భారత జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్లో అతడు గుజరాత్ టైటాన్స్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. చదవండి: Prithvi Shaw: పృథ్వీ షా 'సెల్ఫీ' వివాదంలో కొత్త ట్విస్ట్..! IND Vs AUS 2nd Test Prediction: సూర్య స్థానంలో అయ్యర్.. గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఖరారు -
డైరెక్టర్‌ను పెళ్లాడిన హీరోయిన్.. పోస్ట్ వైరల్
బాలీవుడ్లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇటీవలే అతియా శెట్టి- కేఎల్ రాహుల్, కియారా-సిద్దార్థ్ జంటలు ఒక్కటవ్వగా.. తాజాగా మరో ప్రేమ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. దృశ్యం 2 (హిందీ) డైరెక్టర్ అభిషేక్ పాఠక్, కుదా హఫీజ్ హీరోయిన్ శివలీకా ఒబెరాయ్ పెళ్లి గురువారం అత్యంత వైభవంగా జరిగింది. గోవాలో జరిగిన వెడ్డింగ్‌కు స్నేహితులు, బంధుమిత్రులు హాజరయ్యారు. కాగా.. గతంలోనే టర్కీలో నిశ్చితార్థం చేసుకుంది ఈ జంట. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది బాలీవుడ్ జంట.ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. శివాలికా తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. (ఇది చదవండి: హీరోయిన్‌తో దృశ్యం 2 డైరెక్టర్ పెళ్లి.. పోస్ట్ వైరల్) శివాలికా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మీరు ప్రేమను కనిపెట్టలేదు. ప్రేమే మిమ్మల్ని కనిపెట్టినట్లుంది. మా ఇద్దరి బంధం ఆకాశంలో నక్షత్రాల మధ్య నిర్ణయించినట్లుంది. నా జీవితంలో ఈ రోజును ఎప్పటికీ మరిచిపోలేను. మా ప్రియమైన వారితో వివాహబంధంలోకి అడుగుపెట్టాం. ఇది మా జీవితంలో అత్యంత అద్భుత క్షణం. మా హృదయాలు ప్రేమ, జ్ఞాపకాలతో నిండి ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకమైన ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం.' అని అన్నారు. పెళ్లి గోవాలో 2 రోజుల పాటు అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు అజయ్ దేవగన్, అమన్ దేవగన్, కార్తీక్ ఆర్యన్, నుష్రత్ భరుచ్చా, విద్యుత్ జమ్వాల్, సన్నీ సింగ్, భూషణ్ కుమార్, దర్శకుడు లవ్ రంజన్, ఇషితా రాజ్ శర్మ హాజరయ్యారు. కాగా శివలీకా ఒబెరాయ్ 'యే సాలి ఆషికి' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఖుదా హఫీజ్ 1, 2 సినిమాల్లో నటించగా వీటికి అభిషేక్ పాఠక్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరికి పరిచయం ఏర్పడగా, అది తర్వాత ప్రేమగా మారింది.ఇటీవలే 'దృశ్యం 2'తో అభిషేక్ పాఠక్ సూపర్ హిట్ సాధించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, టబు, అక్షయ్ ఖన్నా, శ్రియా శరణ్, ఇషితా దత్తా, మృణాల్ జాదవ్ నటించారు. View this post on Instagram A post shared by Shivaleeka Oberoi (@shivaleekaoberoi) -
చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్! రిసెప్షన్ ఎప్పుడంటే..
KL Rahul and Athiya Shetty Wedding: కొత్త జంట కేఎల్ రాహుల్- అతియా శెట్టికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా వీరికి ఆశీర్వాదాలు అందిస్తున్నారు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, టీ20 స్టార్ సూర్యకుమర్ యాదవ్, భారత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహా సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్ తదితరులు రాహుల్- అతియాలను విష్ చేశారు. ‘‘కొత్త జీవితానికి ఆరంభించబోతున్న మీకు శుభాకాంక్షలు.. జీవితాంతం ఇద్దరూ ఇలాగే కలిసి ఉండాలి’’ అని ఆకాంక్షించారు. ఇక సూర్య అయితే.. ‘‘చూడచక్కని జంట.. జీవిత భాగస్వాములుగా మీ ప్రయాణానికి ఆల్ ది బెస్ట్.. మీకు ఎవరి దిష్టి తగలకూడదు’’ అని రాహుల్- అతియా ఫొటోను షేర్ చేశాడు. కాగా భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి అతియా శెట్టిని సోమవారం రాహుల్ పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలో ముంబైలో అతియా శెట్టి తండ్రి, బాలీ వుడ్ నటుడు సునీల్ శెట్టికి చెందిన ఫామ్‌హౌస్‌లో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. కివీస్‌తో సిరీస్‌కు దూరం ఇక 30 ఏళ్ల అతియా 2015లో ‘హీరో’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అనంతరం ‘ముబాకరాన్’ ... ‘నవాబ్జాదే’... ‘మోతీచూర్ చక్నాచూర్’ సినిమాల్లో నటించింది. ఇక 30 ఏళ్ల రాహుల్ ప్రస్తుతం భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌కు రాహుల్ దూరంగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 సీజన్ ముగిసిన తర్వాతే రాహుల్- అతియా శెట్టి వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీ ఇవ్వనున్నట్లు సునిల్ శెట్టి మీడియాకు తెలిపాడు. కాగా ఐపీఎల్లో రాహుల్ లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా నూతన జంట తమ పెళ్లి ఫొటోలు షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్ డబుల్ సెంచరీ.. ఇప్పుడు కింగ్? షాహిద్ అఫ్రిదికి షాకిచ్చిన పీసీబీ.. చీఫ్ సెలెక్టర్ బాధ్యతల నుంచి తొలగింపు View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) Congratulations to the loveliest, @klrahul and @theathiyashetty 🤗 Wish you the very best for the most important partnership of your life! ♥️ pic.twitter.com/TxF8Y4Mbfb — Surya Kumar Yadav (@surya_14kumar) January 23, 2023 Congratulations @klrahul & @theathiyashetty. Wishing you both a very happy married life & a lifetime of togetherness. pic.twitter.com/rXTOzOpulO — Suresh Raina🇮🇳 (@ImRaina) January 23, 2023 Congratulations @klrahul for new innings. Wish both of you happy married life ahead.#KLRahulAthiyaShettyWedding https://t.co/sSfulehryO — Munaf Patel (@munafpa99881129) January 23, 2023 The newly wedding couple #KLRahul And #AthiyaShetty.#KLRahulAthiyaShettyWedding pic.twitter.com/pFcXbpQeD6 — Vishwajit Patil (@_VishwajitPatil) January 23, 2023 Sunil Shetty confirms that KL & Athiya are officially married now. Distributes sweets to media and informs about reception post-IPL. #KLRahulAthiyaShettyWedding #IPL2023 pic.twitter.com/IjUs09HqRn — Himanshu Pareek (@Sports_Himanshu) January 23, 2023 -
బుమ్రా పెళ్లి వేడుకల ఫోటోలు.. కొత్త తలనొప్పులు
ముంబై: కొద్దిరోజుల కిందటే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఊహించని తలనొప్పులు వచ్చి పడ్డాయి. తన పెళ్లి వేడుకల్లో తీసుకున్న ఫోటోల్లో బాణసంచా కాల్చడం కనిపించడంతో నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017లో దీపావళి రోజున టపాసులు కాల్చొద్దని ఆయన, తన అభిమానులను కోరుతూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీటే ఆయన తలనొప్పికి కారణంగా మారింది. తన వివాహ వేడుకకు సంబంధించిన రెండు ఫోటోలను శుక్రవారం ఆయన ట్విటర్లో షేర్ చేయడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. 'టపాసులు కాల్చొద్దని ఇతరులకు నీతులు చెప్పడమేనా.. మీరు స్వయంగా ఏమైనా పాటించేదుందా' అంటూ కొందరు, 'ఆచరణ సాధ్యంకాని ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని' మరికొందరు కామెంట్లు చేశారు. గతంలో ఆయన చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు రకరకాల పంచ్‌లు వేస్తున్నారు. కాగా, బుమ్రా ఈనెల 15న క్రీడా ఛానల్ వ్యాఖ్యాత సంజన గణేశన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. Diwali celebration at home! 🎆 Wishing everyone a very Happy and a prosperous Diwali!💥🎆💥#saynotocrackers pic.twitter.com/koCbYkLJ4I — Jasprit Bumrah (@Jaspritbumrah93) October 19, 2017 The last few days have been nothing short of absolutely magical! We are so grateful for all the love & wishes we’ve received. Thank you. pic.twitter.com/dhWH918Ytu — Jasprit Bumrah (@Jaspritbumrah93) March 19, 2021 -
బిగ్‌బాస్ జంట ఫోటోలు మళ్లీ వైరల్!
హిందీ బిగ్ బాస్ సీజన్ 12 కంటెస్టంట్లు జస్లీన్ మాథారు, అనుప్ జలోటా ఫోటోలు గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. వారి ఫోటోలు నెటిజన్లను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ ఫోటోలపై చాలా మంది అనేక ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఈ ఫోటోలు ఎందుకు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అంటే ఈ ఫోటోలో వీరిద్దరు వివాహవస్త్రాలలో కనిపించారు. ఈ ఫోటోలను జస్లీన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. అయితే ఆ ఫోటోలు దేనికి సంబంధించినవో జస్లీన్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో నెటిజన్లు వారికి తోచినట్లు వారు ఊహించుకోవడంతో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఫోటోలు జస్లీన్, అనుప్ కలిసి నటిస్తున్న 'వోహ్ మేరీ స్టూడెంట్ హై' పేరుతో తెరకెక్కబోతున్న చిత్రంలోనివి అని తరువాత తెలిసింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు వీరిపై అనేక పుకార్లు వచ్చాయి. వీరు డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే వారు వీటిని ఖండించారు. అనుప్ జలోటా భజన పాటలు పాడటంలో ప్రసిద్ధి. అయితే ఈ ఫోటోలపై భజన్ సామ్రాట్ అనుప్ స్పందించారు. అవి సినిమా కోసం దిగిన ఫోటోలు అని స్పష్టతనిచ్చారు. ఇక జస్లీన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారా అని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా అస్సలు కాదని ఆమె వస్త్రధారణ సంప్రదాయ బంధమైన తన కుటుంబానికి సరిపోదని తేల్చి చెప్పారు. తాను జస్లీన్ స్టైల్‌ను తప్పుబట్టడం లేదని కానీ థోతి కట్టుకొని దేవుడి భజనలు చేసే తమ ఇంట్లో ఆమె సరిపోదని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రేక్షకులకు ఈ విషయంపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ పెళ్లి ఫోటోలు చూసిన వారందరూ తనకు శుభాకాంక్షలు చెబుతున్నారని తాను కూడా వారికి తిరిగి శుభాకాంక్షలు చెబుతున్నానని ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. చదవండి: నాగార్జున చెప్పింది నచ్చలేదు: స్వాతి -
'ప్రియా.. మరో బాటిల్ వొడ్కా తీసుకురా'
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతి. అందమైన జ్ఞాపకం. జీవితాన్ని మలుపుతిప్పే సందర్భం. అనేకసార్లు గుర్తుకొచ్చే అపురూప ఘట్టం. అందుకే పెళ్లిఫొటోలు అపురూపంగా ఉండాలని ఏ జంట అయినా కోరుకుంటుంది. ఆ ఫొటో ఆల్బం చూడగానే పెళ్లిపుస్తకం తెరిచిన ఆ అనుభూతులు తాజాగా మదిని తట్టాలని ఆశిస్తుంది. కానీ, పై ఫొటో చూడండి. ఈ ఫొటో పెళ్లిరోజున తీసినది.. ఈ ఫొటోని చూసినవారికి వధువు బాగా మందుకొట్టి.. వరుడిని మరో పెగ్గు తీసుకురా.. అని అంటుందా? అన్న సందేహం వస్తుంది.. ఇలాంటి ఫొటోలు ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 20కి పైగానే ఉన్నాయి. సింగపూర్‌కు చెందిన జాక్లిన్ యింగ్ పెళ్లి ఫొటోలివి. అందమైన అనుభూతులను గుర్తుచేయాల్సిన ఈ ఫొటోలు మాత్రం వికృతమైన పోజుల్లో వచ్చాయి. ఫొటోగ్రాఫర్ పొరపాటున క్లిక్ చేశాడో, లేక కావాలని చేశాడో కానీ ఈ ఫొటోలు మాత్రం ఆమెను తీవ్రంగా నిరాశపరిచాయి. 'పెళ్లి ఫొటోలు ఇంత హారిబుల్ గా ఉంటే.. మీకు ఎలా అనిపిస్తుంది? కోప్పడతారా? బాధపడతారా? చూడండి నా ఫొటోలు. చూసి కొన్ని కన్నీళ్లు కార్చండి' అంటూ తన ఫేస్బుక్ పేజీలో ఆమె ఈ ఫొటోలు పెట్టింది. ఈ ఫొటోలు వెంటనే ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఆన్లైన్ ప్రపంచంలో చక్కర్లు కొడుతూ.. సెటైర్ల మీద సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫొటోల్లో వధువు.. వరుడిని 'హనీ.. మరో బాటిల్ వొడ్కా తీసుకురా' అన్నట్టు పోజు ఉందని ఛలోక్తులు వేస్తున్నారు నెటిజన్లు.