'ప్రియా.. మరో బాటిల్‌ వొడ్కా తీసుకురా' | A Couple Terrible Wedding Pics Go Viral | Sakshi
Sakshi News home page

'ప్రియా.. మరో బాటిల్‌ వొడ్కా తీసుకురా'

Published Wed, Apr 13 2016 5:38 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

A Couple Terrible Wedding Pics Go Viral

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతి. అందమైన జ్ఞాపకం. జీవితాన్ని మలుపుతిప్పే సందర్భం. అనేకసార్లు గుర్తుకొచ్చే అపురూప ఘట్టం. అందుకే పెళ్లిఫొటోలు అపురూపంగా ఉండాలని ఏ జంట అయినా కోరుకుంటుంది. ఆ ఫొటో ఆల్బం చూడగానే పెళ్లిపుస్తకం తెరిచిన ఆ అనుభూతులు తాజాగా మదిని తట్టాలని ఆశిస్తుంది.

కానీ, పై ఫొటో చూడండి. ఈ ఫొటో పెళ్లిరోజున తీసినది.. ఈ ఫొటోని చూసినవారికి వధువు బాగా మందుకొట్టి.. వరుడిని మరో పెగ్గు తీసుకురా.. అని అంటుందా? అన్న సందేహం వస్తుంది.. ఇలాంటి ఫొటోలు ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 20కి పైగానే ఉన్నాయి. సింగపూర్‌కు చెందిన జాక్లిన్‌ యింగ్‌ పెళ్లి ఫొటోలివి. అందమైన అనుభూతులను గుర్తుచేయాల్సిన ఈ ఫొటోలు మాత్రం వికృతమైన పోజుల్లో వచ్చాయి. ఫొటోగ్రాఫర్ పొరపాటున క్లిక్‌ చేశాడో, లేక కావాలని చేశాడో కానీ ఈ ఫొటోలు మాత్రం ఆమెను తీవ్రంగా నిరాశపరిచాయి. 'పెళ్లి ఫొటోలు ఇంత హారిబుల్‌ గా ఉంటే.. మీకు ఎలా అనిపిస్తుంది? కోప్పడతారా? బాధపడతారా? చూడండి నా ఫొటోలు. చూసి కొన్ని కన్నీళ్లు కార్చండి' అంటూ తన ఫేస్‌బుక్ పేజీలో ఆమె ఈ ఫొటోలు పెట్టింది. ఈ ఫొటోలు వెంటనే ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఆన్‌లైన్ ప్రపంచంలో చక్కర్లు కొడుతూ.. సెటైర్ల మీద సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫొటోల్లో వధువు.. వరుడిని 'హనీ.. మరో బాటిల్‌ వొడ్కా తీసుకురా' అన్నట్టు పోజు ఉందని ఛలోక్తులు వేస్తున్నారు నెటిజన్లు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement