Wedding photos
-
పెళ్లి రోజు ఫోటోలు షేర్ చేసిన కీర్తి సురేశ్..
-
వైరల్ అవుతున్న నటి వరలక్ష్మి బీచ్ వెడ్డింగ్ ఫొటోలు
-
అదితి-సిద్ధార్థ్ పెళ్లి.. అగ్రతారలతో అరుదైన ఫోటోలు
-
Naga Manikanta: బిగ్‌బాస్ ఫేమ్ నాగమణికంఠ వెడ్డింగ్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
కమెడియన్ కొడుకుతో అర్జున్ కూతురు పెళ్లి(ఫోటోలు)
-
ప్రముఖ నిర్మాత ఆనంద్ పండిట్ కూతురి పెళ్లి.. మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)
-
విడాకులు తీసుకున్నారా? మరి పెళ్లి ఫోటోల సంగతేంటి?
ఫొటోలు బాగా తీసే స్టూడియోలున్నట్లే.. ఫొటో హార్డ్ కాపీలను చిత్తు చిత్తుగా చించేసే స్టూడియో కూడా ఉంది.. రష్యాలో! పెళ్లి ఫెయిలై.. విడాకులు తీసుకున్న చాలామంది దంపతులు తమ పెళ్లి ఫొటో హార్డ్ కాపీలను చించేయడానికో, కాల్చేయడానికో సెంటిమెంట్ అడ్డొచ్చి, బయట పడేస్తే ఆ ఫొటోలను మిస్ యూజ్ చేసే ప్రమాదం ఉంటుందని భయపడి.. ఇలా రకరకాల కారణాలతో వాటిని ఏమీ చేయలేక.. అలాగని ఇంట్లో పెట్టుకోనూలేక సతమతమవుతుంటారు. ఆ బాధను అర్థం చేసుకున్న లియు బైలు అనే వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని ఇంప్లిమెంటే చేశాడు ‘వెడ్డింగ్ ఫొటోస్ ష్రెడింగ్ బిజనెస్’ స్టూడియోతో! డైవోర్స్ తీసుకున్న కపుల్స్ తమ పెళ్లి ఫొటోలను ఈ స్టూడియోకి తెచ్చిస్తే.. ఫోటోలను స్ప్రే పెయింట్‌తో కప్పేసి.. వాటిని ష్రెడింగ్ మెషిన్లో వేసి నుజ్జు నుజ్జు చేసేస్తాడట. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీసి ఆ ఫుటేజ్‌ని క్లయింట్‌కు పంపుతాడు. ఇప్పుడు ఇతని స్టూడియోకి విపరీతమైన గిరాకీ పెరిగి మూడు ఫొటోలు ఆరు రూబుళ్లుగా బిజినెస్ సాగుతోందట. -
Maanas Nagulapalli Srija Wedding: తొలిసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన 'బిగ్ బాస్' మానస్ (ఫొటోలు)
-
దృశ్యం-2 దర్శకుడిని పెళ్లాడిన నటి.. ఫోటోలు వైరల్
-
Mounika Reddy Marriage Pics: బీమ్లా నాయక్ ఫేమ్ మౌనిక పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్
-
వైరల్.. వరుసగా పెళ్లి ఫొటోలు వదిలిన విఘ్నేశ్, సందడిగా కోలీవుడ్ స్టార్స్
ఎంతోకాలంగా ప్రేమలో మునిగిన తేలుతున్న లవ్ బర్డ్స్ విఘ్నేశ్ శివన్-నయనతార గత నెల అగ్నిసాక్షిగా మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. చెన్నైలోని మహాబలిపురంలో జూన్ 9న గురువారం వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు సహా పలువురు సెలబ్రిటీల సమక్షంలో ఈ వివాహం జరిగింది. వీరి పెళ్లి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్ సేతుపతి, కార్తీ, సూర్య దంపతులతో పాటు కోలీవుడ్‌కు చెందిన ఇతర హీరోలు, నటీనటులు సందడి చేశారు. చదవండి: సుమ వల్లే నేను ఇలా ఉన్నాను: నటి ఎమోషనల్ అయితే ఈ జంట పెళ్లై నెల గడిచిన ఇప్పటికి వీరి పెళ్లి ఫొటోలు కానీ, వీడియోలు కానీ పెద్దగా బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో నయన్ భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ వరుసగా తమ పెళ్లి ఫొటోలు ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటున్నాడు. ఈ ఫొటోలు షారుక్, విజయ్ సేతుపతి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఇతర నటీనటులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. చదవండి: సల్మాన్ ఖాన్‌ను మా వర్గం ఎప్పటికి క్షమించదు: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్
Radhika Apte Wedding Photos With Benedict Taylor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధిక ఆప్టే గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రైనా చేయడానికి వెనుకాడదు. విభిన్న పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాధిక ఆప్టే. అయితే ఈ బోల్డ్నెస్ వల్ల ఆమె కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. ఇక తెలుగులో బాలకృష్ణతో ''లయన్, లెజెండ్'' సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. హిందీలో ‘‘ప్యాడ్‌మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్, ఫొరెన్సిక్’’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం 'విక్రమ్ వేదా' చిత్రంలో నటిస్తోంది. సినిమాల వరకు ఓకే కానీ తన పర్సనల్ విషయాలకు చాలా దూరంగా ఉంటుంది రాధిక. అయితే తాజాగా ఆమె భర్తతో దర్శనమిచ్చిన రాధిక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'మీరు మీ భర్తతో కలిసి ఎక్కువగా ఫొటోలు దిగరు.. ఎందుకు ?' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రాధిక ఆప్టే 'నేను ఇక్కడ.. బెన్ (భర్త బెనెడిక్ట్) అక్కడ. ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం. నా పని నేనే చేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాను. నా వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పడం నాకు ఇష్టముండదు. ఇక ఫొటోల విషయానికొస్తే నాకు ఫొటోలపై అంతగా అభిరుచి లేదు. ఇక నాకన్న బెన్ ఇంకా వేస్ట్. ఫొటోలు అంటే అస్సలు కోపరేట్ చేయ్యడు. అందుకే మా పెళ్లి అయి పదేళ్లు కావోస్తున్న ఇప్పటివరకూ మా పెళ్లి ఫొటోలు కూడా లేవు. మేము ఫ్రెండ్స్‌ను పిలిచాం, భోజనం అరేంజ్ చేశాం, మా స్నేహితుల్లో సగం మంది ఫొటోగ్రాఫర్లే. అయినా మాకు ఫొటోలు దిగేంత ఆసక్తి కలగలేదు' అని చెప్పుకొచ్చింది. కాగా కెరీర్ పరంగా ముంబైలో రాధిక ఆప్టే ఉంటే, ఆమె భర్త బెనెడిక్ట్ టేలర్ విదేశాల్లో ఉంటాడు. చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. యాదృచ్ఛికమా! బేబీ బంప్‌తో అలియా భట్ !.. లీకైన ఫొటోలు.. -
Shreyas Gopal: ప్రేయసిని పెళ్లాడిన శ్రేయస్.. ఫొటోలు వైరల్
Cricketer Shreyas Gopal Marries Long Time Girlfriend Nikitha Pics Goes Viral: కర్ణాటక ఆల్‌రౌండర్ శ్రేయస్ గోపాల్ వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల స్నేహితురాలు నిఖితను గురువారం పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శ్రేయస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో అభిమానుల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా బెంగళూరుకు చెందిన శ్రేయస్ గోపాల్ ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, ఈ సీజన్లో అతడు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. బ్యాటర్‌గానూ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం ఏడు పరుగులు మాత్రమే చేశాడు. ఇక రాజస్తాన్ ప్లేఆఫ్స్‌నకు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: IND vs NZ 1st Test- Shreyas Iyer: నెరవేరిన అయ్యర్ కల.. దిగ్గజ క్రికెటర్ చేతుల మీదుగా క్యాప్.. వీడియో -
ఎమ్ఎస్ రాజు కుమారుడు హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి ఫోటోలు
-
ఇంటివాడైన యంగ్ హీరో సుమంత్.. ఫోటోలు వైరల్
ప్రముఖ నిర్మాత ఎమ్ఎస్ రాజు కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్ కు చెందిన దీపికతో అతని వివాహం నగర శివార్లలోని ఫామ్ హౌస్ లో ఇరు వర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు మాత్రమే ఈ వివాహ వేడుకకి హాజరయ్యారు. 'తూనీగ తూనీగ' సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. ఆతర్వాత ‘కేరింత’, ‘లవర్స్’, ‘ప్రేమకథా చిత్రం-2’ సినిమాల్లో నటించాడు. తాజాగా సుమంత్ నటించిన ‘మా కథ’ మూవీ కూడా మార్చి 19న విడుదలకు సిద్దంగా ఉంది -
వ్యాపారవేత్తను పెళ్లాడిన నటి
న్యూఢిల్లీ: టీవీ నటి, ‘దియా ఔర్ బాతీ హమ్’ ఫేం ప్రాచీ తెహ్లాన్ ఓ ఇంటివారయ్యారు. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రోహిత్ సరోహను వివాహమాడారు. శుక్రవారం దేశ రాజధానిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ప్రాచీ ఆదివారం తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. ‘‘మిస్టర్ అండ్ మిసెస్ సరోహా. వివాహ తేదీ: 7.8.2020’’అంటూ తమ జీవితంలోని ముఖ్య ఘట్టానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. పెళ్లి సందర్భంగా వధువు ప్రాచీ ఎరుపు రంగు లెహంగాలో మెరిసిపోగా.. క్రీం కలర్ షేర్వాణీలో వరుడు రోహిత్ ఆకట్టుకున్నాడు. (కుటుంబంలోకి స్వాగతం మిహికా: సమంత) ఈ క్రమంలో కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లితో పాటు ప్రాచీ మెహందీ, హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలు సైతం అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కాగా ఢిల్లీకి చెందిన ప్రాచీ తెహ్లాన్ భారత క్రీడాకారిణిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. నెట్‌బాల్, బాస్కెట్‌బాల్ ప్లేయర్ అయిన ఆమె.. 2010 కామన్వెల్త్ క్రీడల్లో భారత నెట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. నటనపై ఉన్న మక్కువతో టీవీ రంగంలో అడుగుపెట్టారు. ‘దియా ఔర్ బాతీ హమ్’(తెలుగు డబ్బింగ్- ఈతరం ఇల్లాలు) సీరియల్‌తో నటిగా ప్రాచుర్యం పొందారు.(అర్థరాత్రి కత్రినా ఇంటికి విక్కీ.. ఏదో ఉంది!) -
రెండో పెళ్లి చేసుకోలేదు.. అవి ఫోటో షూట్ అంతే
ఏఎల్ విజయ్ తో విడిపోయిన తర్వాత తన రిలేషన్ కి సంబంధించిన ఏ విషయాన్ని బయటకిచెప్పలేదు అమలాపాల్. నటి అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుందంటూ కొత్త భర్తతో లిప్ లాక్ కిస్ పెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తను ప్రేమించిన ముంబై బేస్డ్ సింగర్ భవీందర్ సింగ్‌తో మూడు ముళ్లు వేయించుకుందని తెగ ప్రచారం జరిగింది. దీనిపై అమల్ కూడా స్పందించలేదు. అయితే తాజాగా ఆమె ఓ తమిళ న్యూస్ చానెల్‌తో మాట్లాడింది. తనరెండో పెళ్లి జరిగిందని వస్తున్న ప్రచారాన్ని ఆమె ఖండించింది.తాను రెండో పెళ్లి చేసుకోలేదని.. నెట్లో ఉన్న ఫోటోలు నేను భాగస్వామిగా ఉన్న ఓ సంస్థ కోసం చేసిన ఫోటో షూట్ కోసం అని స్పష్టంచేసింది. అయితే గత కొద్ది రోజుల కింద ఒకవేళ తాను పెళ్లి చేసుకుంటే అందరికీ ముందే చెబుతానని పేర్కొంది. కాగా..చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే అమలాపాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడింది. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తిరిగి ఆమె సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. దర్శకుడు విజయ్‌తో విడిపోయాక అమల కొత్త జీవితం కోసం ప్రయత్నిస్తోందని, ఆ క్రమంలోనే చివరికి భవీందర్‌తో ప్రేమాయణం కూడా.. ఇప్పుడు అది కూడా పెళ్లికి చేరకపోవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
అమలా పరిణయం
ఏఎల్ విజయ్‌తో విడిపోయిన తర్వాత తన రిలేషన్‌షిప్‌కి సంబంధించిన ప్రతీ విషయాన్ని రహస్యంగా ఉంచారు అమలా పాల్. ప్రేమలో ఉన్నానంటారు కానీ ఆ విషయాలేవీ బయటకు చెప్పలేదు. అయితే ముంబైకు చెందిన సింగర్ భవీందర్ సింగ్‌తో అమల ప్రేమలో ఉన్నారని, సహజీవనం చేస్తున్నారనే విషయం కొన్ని రోజుల క్రితం బయటకు వచ్చింది. తాజాగా ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయం బయటకు వచ్చింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు భవీందర్. ప్రస్తుత పరిస్థితులను (కరోనా) అనుసరించి కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఈ పెళ్లి చేసుకున్నారని సమాచారం. అయితే పెళ్లి ఫొటోలను షేర్ చేసిన కొన్ని నిమిషాలకే ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తొలగించారు భవీందర్. అమలా పాల్, భవీందర్ -
వీరి పెళ్లి ఫొటోలు వైరల్, వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : యువతీ యువకులు పెళ్లి చేసుకోని పిల్లా పాపలతో కళకళలాడుతు నిండు నూరేళ్లు జీవించాలన్నది మొన్నటి మాట. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని అత్తా మామలకు దూరంగా ఉండాలన్నది నిన్నటి మాట. పెళ్లి పెటాకులు కాకముందే కలిసున్న నాలుగు రోజులైన గుర్తుండేలా ఆ పెళ్లి ఫొటోలు ఉండాలన్నది నేటి యువతీ యువకుల మాట. అందుకోసమే పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అవుట్ డోర్లో అందమైన ఫొటోలు తీసుకునేందుకు తెగ పోటీ పడుతున్నారు. అలా అదే తరహాలో కేరళలోని కోచికి గంట దూరంలోని చెరతాల గ్రామంలో బిచూ ప్రతాపన్, ఇందు బిచూలు తమ పెళ్లి సందర్భంగా తీసుకున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బిచూ ప్రతాపన్ పెరంట్లో ఉన్న ఓ చిన్న కుంటలో పై నుంచి వర్షపు జల్లులు కురుస్తుండగా ‘ఉరిలి’గా పిలిచే పెద్ద జబ్బతట్టలో బిచూ, ఇందులు పరస్పరం అభిముఖంగా ఒరిగారు. ఆకాశం నుంచి కురుస్తున్న చిరు జల్లులు చల్లగా మొహం మీద పడుతూ మంచు ముత్యాల్లా ఎగిరి పడుతుంటే అంతులేని తన్మయత్వంలో వారిద్దరూ మునిగి తేలుతున్నట్లు ఉంది ఆ ఫొటో. అందుకే అది వైరల్ అవుతోంది. అప్పుడు నిజంగా వర్షం కురవలేదు. అంత ఆనందాన్ని కూడా వారు అనుభవించి ఉండరు. అలా ఆ ఫొటోను తీసిందీ దశాబ్దం పాటు వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న షైన్ సిద్ధార్థ్. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోబోయే జంటలు పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అవుట్ డోర్లో అంటే, ఆరుబయట చెట్ల కింద, చెరువు గట్టుపై చెంగల్వ పూతోటలో, నదీ తీరాన ఇసుక తిన్నెలపై, సముద్రపు అలల అంచున ఫొటోలు దిగేందుకు ఇష్టపడుతున్నారని ఆయన చెప్పారు. ‘కేరళలో పెళ్ళిళ్లు అతి త్వరగా ముగుస్తాయి. ఐదు నుంచి 15 నిమిషాల్లో తతంగమంతా అయిపోతుంది. ఈ తతంగంలో ఆకట్టుకునే ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించాలి. కొన్ని క్షణాల్లో కొన్ని ఫొటోలను మిస్సయ్యే ప్రమాదం ఉంది. అందుకేనేమో పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అవుట్ డోర్ ఫొటో షూటింగ్‌లు మొదలయింది. అవసరం అదే కావచ్చుగానీ స్ఫూర్తి మాత్రం మలయాళ సినిమాల నుంచి వచ్చిందేనని చెప్పవచ్చు’ అని వసీమ్ అహ్మద్ అనే ఫొటోగ్రాఫర్ తెలిపారు. ఆయన చెన్నైలో ప్రత్యేక వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లతో ఏర్పాటయిన ‘మేడిన్ మోనో’ సంస్థ సహ వ్యవస్థాపకుడు. తాను తరచుగా కేరళకు వెళ్లే పెళ్లి ఫొటోలు తీస్తుంటానని చెప్పారు. ఐదు నుంచి పది లక్షల రూపాయలు పెళ్లి సందర్భంగా కొత్త దంపతులు, వారు బంధు మిత్రులను మూడు రోజులపాటు ఫొటోలు తీయడానికి తాము ఐదు నుంచి పది లక్షల రూపాయల వరకు తీసుకుంటామని, తమ బృందంలో ఐదారుగురు ఫొటోగ్రాఫర్లు ఉంటారని వసీమ్ అహ్మద్ తెలిపారు. పది వేల నుంచి 20 వేల వరకు ఫొటోలు తీస్తామని, వాటిల్లో మంచివనుకున్నవి రెండు వేల నుంచి రెండున్నర వేల వరకు ఎంపిక చేసి కస్టమర్లకు ఇస్తామని ఆయన చెప్పారు. తమ బృందంలో ఒక్కో ఫొటోగ్రాఫర్ వ్యక్తిగతంగా 70 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తారని, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 35 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ఉత్తరాదికి దక్షిణాదికి ఎంతో తేడా దక్షిణాదిలో మొదటి నుంచి చివరి వరకు వధూవరులపైనే కెమెరాల దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది. పెళ్లికి వచ్చిన, వస్తున్న అతిథులను, భోజనం చేసేటప్పుడు వారి హావభావలను తీయడం మామూలుగా ఉంటుంది. ఉత్తరాదిలో పెళ్లి వేడుకలతోపాటు పార్టీ జరుగుతున్న తీరు, అంకుల్స్, ఆంటీల డ్యాన్స్‌కు ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుందని ఈ స్పెషలిస్ట్ ఫొటోగ్రాఫర్లు చెబుతున్నారు. నేడు పెళ్లిళ్లన్నవి దేశంలో ఏటా లక్ష కోట్ల రూపాయల వ్యాపారమని అసోచామ్ 2017లో ఓ నివేదికలో వెల్లడించింది. ఒక్క కేరళలోనే పెళ్లికి కొనే బంగారాన్ని కలుపుకొని ఏటా పది వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నదట. కేరళలో తలసరి సగటున నెలకు 400 రూపాయలను బంగారంపై ఖర్చు చేస్తున్నారట. ఇక ప్రతి పెళ్లికి రెండు గ్రాముల నుంచి కిలో వరకు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారట. ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి! కొన్ని జంటలు కొండ శిఖరాగ్రాలపై, కొందరు సముద్రపు అలలపై, మరికొందరు చెట్ల తోపులతో తులతూగే సరస్సులో ఫొటోలు తీసుకోవాలనుకుంటారని కొట్టాయంలోని కేరళ వెడ్డింగ్ ఫొటోగ్రఫి సంస్థ వ్యవస్థాపకులు సంజీవ్ వర్గీస్ తెలిపారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే షూటింగ్ సందర్భంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. కేరళ పర్యాటక ప్రాంతాల్లో ఫొటోలు తీయాలంటే ముందుగా మున్సిపాలిటీ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన ప్రతిభా ఎంవీ, ఈశ్వర్ కే. దంపతులు గతేడాది నవంబర్ నెలలో తమను సంప్రతించారని, ప్రముఖ వెంబనాడ్ సరస్సులో వారు ఫొటోలు దిగాలనుకున్నారని, అందుకు తాము రెండు నాటు పడవలను అద్దెకు తీసుకొని సరస్సులో వెళ్లామని చెప్పారు. ఆరోజున వారిని వివిధ భంగిమల్లో ఫొటోలు తీయడానికి ఏడెనిమిది గంటలు పట్టిందని తెలిపారు. కేరళలోనే ఈ ట్రెండ్ ఎక్కువ పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత ప్రత్యేక ఫొటో షూటింగ్‌లకు కేరళ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి కొండలు, గుట్టలు, నదులతో కూడిన ప్రాకృతిక సౌందర్యమే కారణమని చెన్నైకి చెందిన మరో వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ వినయ్ అరవింద్ తెలిపారు. సోషల్ మీడియా విస్తరించిన నేపథ్యంలో ఇలాంటి ఫొటోలకు డిమాండ్ మరింత పెరిగిందని ఆయన చెప్పారు. కేరళ పెళ్లి ఫొటోల ఫేమ్ గురించి తెలిసి విదేశీ జంటలు కూడా ఇప్పుడు వెడ్డింగ్ ఫొటోల కోసం వస్తున్నారని ఆయన చెప్పారు. ఫొటోలు ఆకాశం నుంచి తీసినట్లు ఉండాలనుకుంటే ఇది వరకు పెద్ద పెద్ద క్రేన్లు ఉపయోగించాల్సి వచ్చేదని, ఇప్పుడు ద్రోణ్ కెమేరాలు రావడంతో ఆ బాధ తప్పిందని ఆయన చెప్పారు. -
స్పైడర్ మ్యాన్ ఫొటోగ్రాఫర్..!
-
వీడెవడండీ బాబు.. స్పైడర్ మ్యానా? ఫొటోగ్రాఫరా?
ఏదైనా పని చేపట్టినపుడు దానిమీదే దృష్టి మొత్తం కేంద్రీకరించినప్పుడు ఫలితం తొందరగా దరిచేరుతుందంటారు. అంతేకాదు మనకు నచ్చిన పనిలో ఎంత కష్టం ఉన్నా అది ఇష్టంగానే అనిపిస్తుంది. దానిపై ఎంతో శ్రద్ధ పెట్టి ముందుకెళ్తాము. ఒక్కోసారి దాని కోసం ఎంతటి సాహసాలు చేయడానికైనా వెనకాడం. అందుకు నిదర్శనంగా ఈ ఫొటోగ్రాఫర్‌ని చెప్పుకోవచ్చు. అసలు విషయానికి వస్తే.. కొత్తగా పెళ్లైన ఓ జంట ఫొటోలు తీయించుకోవడానికి ఓ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌కి కబురు పెట్టారు. దీంతో ఫోటోగ్రాఫర్ వచ్చి నవ దంపతులకు ఫోటో షూట్ చేశాడు. అయితే అతను ఫొటోలు తీసే విధానం చూసి ఆ దంపతులే కాదు.. నెటిజన్లు కూడా అవాక్కయ్యారు. ఆ ఫొటోగ్రాఫర్ వారిద్దరినీ ఓ చెట్టు కింద నిలబడమని చెప్పి అతను ఓ చెట్టు ఎక్కాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ మరీ వారి ఫొటో తీశాడు. ఆ ఫొటో కూడా చాలా చక్కగా వచ్చింది. ఇలా ఫొటో తీస్తున్న వీడియోను రాజబాబు అనే నెటిజన్ తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘నేరాలకు వ్యతిరేకంగా పోరాడటానికి స్పైడర్ మ్యాన్ కావాలనుకున్నప్పుడు.. తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక ఫొటోగ్రాఫర్ అయితే ఇలాగే ఉంటుంది’ అని సరదాగా ట్వీట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడెవడండీ బాబు.. స్పైడర్ మ్యానా.? ఫొటోగ్రాఫరా.? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. అయితే ఫోటో షూట్ ఎక్కడ జరిగింది అన్న విషయం తెలియదు. -
తుఫానులో పెళ్లి.. ముద్దు సీన్ అదుర్స్
టెక్సాస్: పెళ్లి అంటే ఎంత హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ఓ పెద్ద వర్షం వచ్చి వెళ్లినట్లుంటుంది హడావుడి. సాధారణంగా పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లకయితే ఇరు కుటుంబ పెద్దలు మాత్రమే కష్టపడుతూ హైరానాపడుతూ ఉంటారు. ఇక పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు మాత్రం కొంత ఉత్సాహంతో మిత్రులతో ఆ విషయాన్ని పంచుకుంటూ సందడిగా కనిపిస్తారు. అదే పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం అయితే మాత్రం పెద్దలకంటే రెట్టింపు ఉత్సాహంతో ఆ జంట పరుగులు పెడుతుంటారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన షెల్లీ, క్రిస్ హాలాండ్ అనే జంటది కూడా ఈ కోవకు చెందిన వివాహమే. సెప్టెంబర్ 2న జరగాల్సిన వారి వివాహం కోసం దాదాపు ఆరునెలలు ప్లాన్ చేసుకున్నారు. ఒక్కొక్కటి శ్రద్ధగా సమకూర్చుకొని రెడీ అయిపోయారు. కానీ, వారి ఆశలు అడియాశాలయ్యాయి. అంగరంగ వైభవంగా, అతిధుల మధ్య జరుపుకోవాల్సిన వివాహం ఓ నలుగురికే పరిమితమైంది. ఓ విందు భోజనం లేదు.. ఓ ఆటపాట లేదు. కానీ, వారు పెళ్లి చేసుకున్న విధానం మాత్రం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. అరకొరగా జరిగిన ఆ వివాహానికి సంబంధించిన ఓ ఫొటోను ఆ జంట ఫేస్బుక్లో పంచుకోగా దాదాపు 20వేల షేర్లు, నాలుగు లక్షలమంది ప్రతిస్పందనలు వచ్చాయి. ఇంతకీ వారి పెళ్లికి ఏ అడ్డంకి ఎదురైందనుకుంటున్నారా.. హార్వీ. మొన్నటికి మొన్న వచ్చిన పెను తుఫాను అమెరికాలో పలు నగరాలను ముంచెత్తిన విషయం తెలిసిందే. దీని ప్రభావం షెల్లీ దంపతుల వివాహం పై పడింది. 'నేను, నా భర్త ఆరు నెలలుగా చేసుకున్న ప్రణాళిక మొత్తం తుఫాను హార్వీ వల్ల నాశనమై పోయింది. మా వివాహ కేకు, వివాహ చోటు, క్యాటరింగ్, బంధువులు, ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా నష్టం జరిగింది' అంటూ హాలాండ్ తన ఫేస్బుక్లో పేర్కొంటూ ఓ పెళ్లి ఫొటోను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో దాదాపు మొకాళ్ల వరకు నీళ్లు రాగా పెళ్లి కొడుకు షెల్లీ నవ వధువు అయిన క్రిస్ హాలండ్‌ను పైకి ఎత్తుకోగా ఇద్దరు గాఢ చుంబనంలో మునిగిపోయారు. ఎంత ఉధృతంగా ఎన్ని హార్వీలు వచ్చినా మిమ్మల్ని మాత్రం విడదీయలేవని చెబుతున్నామంటూ ఈ ఫొటో చూసిన వారంతా స్పందించారు. -
ప్రాణంమీదకు తెచ్చిన పెళ్లి ఫొటోలు
రేక్ జవిక్: వెరైటీగా ఉంటుందనుకున్న వెడ్డింగ్ ఫొటో షూట్ కాస్తా వధువు ప్రాణాలమీదకు తెచ్చిన సంఘటన ఐస్ లాండ్ లో చోటుచేసుకుంది. చైనాకు చెందిన ఓ కొత్త జంట పెళ్లిఫొటోలు తీయాల్సిందిగా ప్రపంచంలో బెస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లలో ఒకరైన సీఎం లెంగ్ ను కోరారు. ఆమేరకు అందరూ కలిసి ఐస్ లాండ్ కు వెళ్లారు. వివిధ పర్యాటక ప్రాంతాలు, రమణీయ ప్రదేశాల్లో వధూవరులను వివిధ భంగిమల్లో ఫొటోలు తీశాడు లెంగ్. ఆఖర్లో ఓ నదీతీరంలో జరిగిన ఫొటోషూట్ మాత్రం ప్రమాదకరంగా మారింది. నదీ తీరంలో హెలికాప్టర్ బ్యాగ్రౌండ్ లో ఫొటో తీయాలనుకున్న లెంగ్.. ఐర్లాండిక్ కోస్టల్ గార్డ్ హెలికాప్టర్ ఒకదానిని అద్దెకు తీసుకున్నాడు. పాల నురగలాంటి పెళ్లి దుస్తుల్లో వెయిల్ పట్టుకుని నిల్చున్న పెళ్లి కూతురుపై నుంచి హెలికాప్టర్ వెళుతుండగా ఫొటోలు చిత్రీకరించాల్సిఉంది. అయితే హెలికాప్టర్ సరాసరి తలపైకి వచ్చేసరికి.. రెక్కల గాలి ఉధృతికి వధువు చిగురుటాకులా వణికి, కిందపడబోయింది. ఆమె ధరించిన వెయిల్ అమాంతం ఎగిరి హెలికాప్టర్ రెక్కల్లో ఇరుక్కుంది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఘోరప్రమాదం తప్పినట్లైంది. ముఖాన దుమ్ము, చెరిగిన జుట్టుతో ఆ పెళ్లికూతురికి ఏడుపొక్కటే తక్కువ! ఇంతటి ప్రమాదకర స్థితిలోనూ అద్భుతమైన ఫొటోలు తీసీ కొత్తజంట కోపాన్ని సంతోషంగా మార్చేశాడు ఫొటోగ్రాఫర్ సీఎం లెంగ్. వాటితోపాటు అతను తీసిన ఫొటోలు కొన్ని మీకోసం.. -
ప్రాణంమీదకు తెచ్చిన పెళ్లి ఫొటోలు
-
'ప్రియా.. మరో బాటిల్ వొడ్కా తీసుకురా'
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతి. అందమైన జ్ఞాపకం. జీవితాన్ని మలుపుతిప్పే సందర్భం. అనేకసార్లు గుర్తుకొచ్చే అపురూప ఘట్టం. అందుకే పెళ్లిఫొటోలు అపురూపంగా ఉండాలని ఏ జంట అయినా కోరుకుంటుంది. ఆ ఫొటో ఆల్బం చూడగానే పెళ్లిపుస్తకం తెరిచిన ఆ అనుభూతులు తాజాగా మదిని తట్టాలని ఆశిస్తుంది. కానీ, పై ఫొటో చూడండి. ఈ ఫొటో పెళ్లిరోజున తీసినది.. ఈ ఫొటోని చూసినవారికి వధువు బాగా మందుకొట్టి.. వరుడిని మరో పెగ్గు తీసుకురా.. అని అంటుందా? అన్న సందేహం వస్తుంది.. ఇలాంటి ఫొటోలు ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 20కి పైగానే ఉన్నాయి. సింగపూర్‌కు చెందిన జాక్లిన్ యింగ్ పెళ్లి ఫొటోలివి. అందమైన అనుభూతులను గుర్తుచేయాల్సిన ఈ ఫొటోలు మాత్రం వికృతమైన పోజుల్లో వచ్చాయి. ఫొటోగ్రాఫర్ పొరపాటున క్లిక్ చేశాడో, లేక కావాలని చేశాడో కానీ ఈ ఫొటోలు మాత్రం ఆమెను తీవ్రంగా నిరాశపరిచాయి. 'పెళ్లి ఫొటోలు ఇంత హారిబుల్ గా ఉంటే.. మీకు ఎలా అనిపిస్తుంది? కోప్పడతారా? బాధపడతారా? చూడండి నా ఫొటోలు. చూసి కొన్ని కన్నీళ్లు కార్చండి' అంటూ తన ఫేస్బుక్ పేజీలో ఆమె ఈ ఫొటోలు పెట్టింది. ఈ ఫొటోలు వెంటనే ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఆన్లైన్ ప్రపంచంలో చక్కర్లు కొడుతూ.. సెటైర్ల మీద సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫొటోల్లో వధువు.. వరుడిని 'హనీ.. మరో బాటిల్ వొడ్కా తీసుకురా' అన్నట్టు పోజు ఉందని ఛలోక్తులు వేస్తున్నారు నెటిజన్లు.